తమ్మిడికుంట సరస్సు: ఒకప్పుడు వ్యర్థాలు.. ముక్కు మూసుకొని పోయే పరిస్థితులు.. బయో వెస్ట్ డంప్ చేసేవారు. పైగా ఆక్రమణలు దర్జాగా సాగిపోయేవి. ఒక పేరు పొందినవాడు అక్కడ కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని తమ్ముడి కుంట దరిద్రాలు ఒక పట్టాన అర్థంకాదు. అసలే మాదాపూర్ ప్రాంతం.. అక్కడ చదరపు గజం బంగారంతో తూగుతోంది. ఇలాంటి సమయంలో తమ్ముడి కుంట ను బాగు చేయడానికి.. పూర్వరూపం అందించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది […]
తమ్మిడికుంట సరస్సు: ఒకప్పుడు వ్యర్ధాలు.. ముక్కు మూసుకొని పోయే పరిస్థితులు.. బయో వెస్ట్ అక్కడే డంప్ చేసేవారు. పైగా ఆక్రమణలు దర్జాగా సాగిపోయేవి. ఒక పేరు పొందినవాడు అక్కడ కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని తమ్ముడి కుంట దరిద్రాలు ఒక పట్టాన అర్థంకాదు. అసలే మాదాపూర్ ప్రాంతం.. అక్కడ చదరపు గజం బంగారంతో తూగుతోంది. ఇలాంటి సమయంలో తమ్ముడి కుంట ను బాగు చేయడానికి.. పూర్వరూపం అందించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపొందించిన హైడ్రా వ్యవస్థ ఈ చెరువుకు జీవం పోసేందుకు ప్రణాళిక రూపొందించింది. హైడ్రా అధినేత రంగనాథ్ తమ్మిడి కుంట విషయంలో చొరవ తీసుకున్నారు.
తమ్మిడి కుంటును బాగు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించబోతున్నారు. ఈ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తమ్మిడి కుంట ఇప్పుడు సరికొత్తగా దర్శనమిస్తోంది. ఆక్రమణలు తొలగిపోయి.. నిండుగా నీటితో ఆహ్లాదంగా ఏర్పడింది. ఇంతకీ ఈ చెరువు ఇలా ఎలా మారింది.. దీని వెనక హైడ్రా అధినేత రంగనాథ్ ఎదుర్కొన్న సభలు ఏ విధంగా ఉన్నాయి.. న్యాయపరమైన చిక్కులు ఎలా అధిగమించగలిగారు.. వీటన్నింటిని ఈ కథనంలో తెలుసుకుందాం.
ఓ సినీ నటుడికి చెందిన కన్వెన్షన్ సెంటర్ ను ఈ చెరువు పక్కన నిర్మించారు. దానిని 2024 ఆగస్టు 24న కూల్చివేశారు. ఇది కాస్త చర్చకు దారి తీసింది. ఆ చెరువు నిర్మాణం భూమిని ఆక్రమించి చేసిందని హైడ్రా అవకాశం. ఈ వ్యవహారంతో తమ్మిడి కుంట చెరువు పునరుద్ధరణకు విస్తృత ప్రచారం లభించింది. ఈ చెరువులో ఆక్రమణలు తొలగించడం ఒక ఎత్తయితే.. చెరువులోకి చేరుతున్న మురుగునీటిని అడ్డుకోవడం మరొక పెద్ద సవాలు. చెరువు పరిసర ప్రాంతాల నుంచి మురుగు.. ప్లాస్టిక్ వ్యర్థాలు.. ఇతర చెత్త పేరుకుపోవడంతో నీటి నాణ్యత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను రంగనాథ అధికారులకు అనేక రకాలుగా సూచనలు చేశారు. చెరువులో పేరుకుపోయిన బయో వేస్ట్.. మురుగును తొలగించారు.
మురుగునీరు చెరువులోకి చేరకుండా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. వర్షపు నీరు మాత్రమే చెరువులోకి చేరే విధంగా ఇన్ లెట్లను అభివృద్ధి చేశారు. మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీ పి ఏర్పాటుకు ప్రతిపాదన రూపొందించారు. చెరువు పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించి.. వేరు చేసే కేంద్రాలు కాలుష్యానికి కారణమవుతున్నాయి.. వాటిని అక్కడి నుంచి తొలగించారు. రంగనాథ్ దృష్టిలో చెరువు పునరుద్ధరణ అంటే కేవలం నీటిని నిల్వ చేయడం మాత్రమే కాదు.. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా అభివృద్ధి చేయడం కూడా.. ఈ చెరువు చుట్టూ 1.25 పొడవు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. రోజ్ గార్డెన్ ఏర్పాటు చేశారు. రెండు గెబీబోలు ఏర్పాటు చేశారు. ఓపెన్ జిమ్ లు నిర్మించారు. పిల్లలకు ఆట స్థలాలు ఏర్పాటు చేశారు. సందర్శకులు కూర్చోవడానికి విశ్రాంతి ప్రాంతాలు నిర్మించారు. చెరువు చుట్టూ పచ్చదనం నిర్మించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ పనుల కోసం హైడ్రా 20 కోట్లు ఖర్చు చేసింది.
ఈ చెరువు చుట్టూ మాదాపూర్ శిల్పారామం.. తాజా చార్మినార్ ప్రాంతాల్లో వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం కూడా ఒక సమస్య. కాబట్టి చెరువు సుందరి కరణతో పాటు వర్షం నీటి ప్రవాహానికి సరైన మార్గాలు ఏర్పాటు చేయడంపై రంగనాథ్ దృష్టి పెట్టారు. వర్షపు నీరు చెరువులోకి చేరే విధంగా ఇన్ లెట్ లు ఏర్పాటు చేశారు. చెరువు నుంచి అదనపు నీరు బయటకు వెళ్ళేందుకు అవుట్ పైప్ లైన్ నిర్మించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని చెరువులోకి మళ్లించే ఏర్పాటు చేశారు. కిందివైపు ఉన్న ముండ్ల కత్వ చెరువుతో నీటి ప్రవాహ అనుసంధానాన్ని మెరుగుపరిచారు. 2026 ఏప్రిల్‌లో హైడ్రా.. సైబరాబాద్ మునిసిపల్ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. వరద నీటి మళ్లింపు వ్యవస్థను మరింత మెరుగుపరిచారు.
అనేక సవాళ్లు
తమ్మిడి కుంట చుట్టూ ఆక్రమణలు తొలగింపు అత్యంత చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఒక సినీ నటి కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో ఈ వ్యవహారం రాజకీయంగా.. సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆక్రమణలు తొలగించిన తర్వాత చెరువు శుభ్రంగా మారలేదు. మురుగునీరు.. ప్లాస్టిక్.. బయో వెస్ట్.. మళ్లీ చేరకుండా హైడ్రా రంగనాథ్ చర్యలు చేపట్టారు. చెరువు ఎఫ్ టి ఎల్.. బఫర్ జోన్ల పరిధిలో ఉన్న భూముల విషయంలో యాజమాన్య హక్కులు.. నోటీసులు.. కోర్టు ఆదేశాలు కీలకంగా మారాయి. హైడ్రా చర్యలపై కొంతమంది భూ యజమానులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. 2025 నవంబర్‌లో ఖానామెట్ ప్రాంతంలో తమ్మిడికుంటకు సంబంధించిన ప్రైవేట్ భూములపై చర్యలు.. కోర్టు స్టేటస్‌కు అమలు అంశంపై తెలంగాణ హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది. చట్టబద్దమైన విధానాలను పాటించాల్సిన అవసరాన్ని న్యాయస్థానం స్పష్టం చేసింది.
చెరువును బాగు చేయడం ఒక భాగమైతే.. భవిష్యత్తులో మళ్లీ ఆకృత్యాలు చోటు చేసుకోకుండా చూడడం.. చెత్త పేరుకుపోకుండా చూసుకోవడం.. మురుగునీరు చేరకుండా అడ్డుకోవడం అసలైన పరీక్ష. దీనికోసం రంగనాథ్ చెరువు చుట్టూ కంచె నిర్మించారు.. ఇప్పుడు చెరువు విస్తీర్ణం సుమారు 30 ఎకరాలు పెరిగింది. గతంలో మిగిలిన విస్తీర్ణం 14 ఎకరాలు మాత్రమే ఉండేది. ఇక వాకింగ్ ట్రాక్ 1.25 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. అభివృద్ధి కోసం 20 కోట్లు ఖర్చు చేశారు.
