Home Latest News 9వ తరగతిలో మంచి మార్కులు.. కొడుక్కి రూ.2 కోట్ల బీఎండబ్ల్యూ గిఫ్ట్..! | షంసుద్దీన్ మిద్య | BMW M4 పోటీ | పశ్చిమ బెంగాల్ వ్యాపారవేత్త | లగ్జరీ కారు బహుమతి – Andhra Waves

9వ తరగతిలో మంచి మార్కులు.. కొడుక్కి రూ.2 కోట్ల బీఎండబ్ల్యూ గిఫ్ట్..! | షంసుద్దీన్ మిద్య | BMW M4 పోటీ | పశ్చిమ బెంగాల్ వ్యాపారవేత్త | లగ్జరీ కారు బహుమతి – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. చిన్న బహుమతులు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తారు. కానీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ తండ్రి మాత్రం తన కుమారుడి ప్రతిభకు ఇచ్చిన బహుమతి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంతో ఏకంగా కోట్ల రూపాయల విలువైన బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. చదువులో చూపిన ప్రతిభకు తండ్రి ఇచ్చిన ఈ అపురూపమైన కానుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పశ్చిమ బెంగాల్‌ పుర్బా బర్ధమాన్ జిల్లా గల్సి ప్రాంతంలోని పరాజ్ గ్రామానికి చెందిన షంసుద్దీన్ మిద్యా ప్రముఖ బియ్యం వ్యాపారి. ఆయన కుమారుడు మహమ్మద్ తల్హా వయసు కేవలం 15 ఏళ్లు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే తల్హాకు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారును సొంతం చేసుకోవాలన్నది అతడి కల.

కొడుకుకు కార్లపై ఉన్న ఇష్టాన్ని గమనించిన తండ్రి ఓ మాట ఇచ్చారు. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే నచ్చిన కారు కొనిస్తానని హామీ ఇచ్చారు. తండ్రి మాట ఇచ్చినను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో తల్హా చదువుపై దృష్టి పెట్టాడు. పరీక్షల్లో అద్భుతమైన మార్కులు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో కొడుకు కష్టాన్ని, పట్టుదలను చూసి మురిసిపోయిన తండ్రి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.

అంతే.. కొడుకు కలను నిజం చేసేందుకు ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఉన్న బీఎండబ్ల్యూ షోరూమ్‌కు వెళ్లారు. అక్కడ అత్యాధునిక హంగులతో కూడిన బీఎండబ్ల్యూ ఎం4 కాంపిటీషన్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశారు. ప్రత్యేక కార్లో కారును తన స్వగ్రామానికి పంపించారు. కోట్ల విలువైన కారు చేరుకోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. తమ గ్రామానికి ఇంత ఖరీదైన కారు రావడంతో ఆసక్తిగా తిలకించారు.

ఇది కూడా చదవండి: ఓ రైడ్ కొడదాం గురూ.. నగరాల్లో బైక్ ట్యాక్సీల జోరు.. యువతకు చేతినిండా పని.!

ఈ కారు మార్కెట్ విలువ సుమారు రూ.1.62 నుంచి రూ.2.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇప్పటికే షంసుద్దీన్ వద్ద పలు ఖరీదైన కార్లు, కొడుకు చదువులో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ ప్రత్యేకమైన బహుమతిని అందించడం విశేషం.

అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. తల్హా వయసు ఇంకా 15 ఏళ్లు కావడంతో అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. తండ్రి కారు తర్వాత, ప్రస్తుతానికి తానే నడుపుతానని, చట్టబద్ధంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన కుమారుడికి కారు నడిపే అవకాశం ఇస్తానని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది కొడుకు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తండ్రిని ప్రశంసిస్తుంటే, మరికొందరు చిన్న వయసులోనే ఇంతటి ఖరీదైన బహుమతి ఇవ్వడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

తన.. కొడుకు కలను తెలుసుకుని, దాన్ని నిజం చేయడానికి తండ్రి చేసిన ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మార్కుల కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తండ్రి.. తన విజయంతో ఆ మాటను నిజం చేసిన కొడుకు.. ఈ ఇద్దరి కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.!

మీకు నచ్చవచ్చు: రాహుల్‌కు ముందే పుట్టిన మగబిడ్డ.. తొలి కాన్పుపై సోనియా భావోద్వేగ జ్ఞాపకాలు.!

[ Shamsuddin Midya, BMW M4 Competition, West Bengal businessman, Luxury car gift, Mohammad Talha]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird