Home Latest News భాగస్వామ్య సదస్సుకు అమిత్ షా డుమ్మా: హాజరు కానున్న పీయూష్ గోయెల్.! | అమిత్ షా విశాఖ పర్యటన రద్దు | CII భాగస్వామ్య సదస్సు | పీయూష్ గోయల్ హాజరు | విశాఖపట్నం సిఐఐ సమావేశం – Andhra Waves

భాగస్వామ్య సదస్సుకు అమిత్ షా డుమ్మా: హాజరు కానున్న పీయూష్ గోయెల్.! | అమిత్ షా విశాఖ పర్యటన రద్దు | CII భాగస్వామ్య సదస్సు | పీయూష్ గోయల్ హాజరు | విశాఖపట్నం సిఐఐ సమావేశం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


విశాఖ వేదికగా గురువారం (నవంబర్ 12) నుంచి ప్రారంభం కానున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కావడం లేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ పర్యటన సదస్సుకు హాజరు కావాల్సి ఉంది, అనివార్య కారణాల వల్ల ఆయన రద్దైంది. ఈ కేంద్ర హోంశాఖ అఫీషియల్ గా ప్రకటించింది.

విశాఖ వేదికగా జరగాల్సిన భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవానికి రావాల్సి కేంద్ర మంత్రి అమిత్ షా అనివార్య కారణాలతో తన పర్యటనను రద్దు చేయడంతో..ఆయన బదులుగా ఈ సదస్సు ప్రారంభానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గురు, శుక్రవారాలలో (నవంబర్ 12, 13 ) రెండు రోజుల పాటు ఈ భాగస్వామ్య సదస్సు జరగనుంది. సీఐఐ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీ, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ భారీ ఈవెంట్‌కు శ్రీకారం చుట్టాయి.

‘నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 58 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, వివిధ రంగాల అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ఇది చదవండి: విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు: పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యం.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సదస్సుకు కో-ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న కార్యక్రమ నిర్వహణను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా, నవంబర్ 13న జరగనున్న ముగింపు సమావేశానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

కాగా ఈ సదస్సులో చర్చించాల్సిన ముఖ్యమైన అంశాలు, ప్రకటించబోయే డిక్లరేషన్లు, విదేశీ ప్రతినిధుల రాకపై సీఎం ఇప్పటికే అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విశాఖ వేదికగా జరిగే ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో అపారంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక దిగ్గజాలకు బలంగా చాటిచెప్పాలన్నారు. విధాన రూపకర్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్స్ మధ్య బలమైన వారధిగా ఈ సదస్సు నిలవాలని చంద్రబాబు సూచించారు.

మీకు నచ్చవచ్చు: ఈ నెల 12, 13వ తేదీల్లో సాగర తీరాన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026.!

అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ఏపీ నంబర్ 2: యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడి.!

[Amit Shah Visakhapatnam Tour Canciled, CII Partnership Summit, Piyush Goyal Attend, Visakhapatnam CII Meeting, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird