Home తెలంగాణ YS Anil Reddy: వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లి.. మందు కోసమే 120 – Andhra Waves

YS Anil Reddy: వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లి.. మందు కోసమే 120 – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


వైఎస్ అనిల్ రెడ్డి:పేరుపొందిన అంతర్జాతీయ బ్రాండ్లు.. వాటి ధర లక్షల్లోనే ఉంటుంది. అటువంటి బ్రాండ్లు లెక్కకు మిక్కిలి. నిజానికి మంచినీళ్ల లాగానే విదేశీ బ్రాండ్లు అక్కడ లభ్యమయ్యాయి. అలాగని అదేమీ లిక్కర్ ఎక్స్ పో కాదు. అక్కడ జరిగింది పెళ్లి.. ముమ్మాటికి పెళ్లి.. ఆ పెళ్లిలో మద్యం ఏరులుగా పారింది. ఒక ముక్కలో చెప్పాలంటే మంచినీళ్లు ఇచ్చారో లేదో తెలియదు గాని.. మందు మాత్రం గట్టిగానే పోశారని వినికిడి.

చెన్నై వేదికగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ జార్జిరెడ్డి కుమారుడు అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఘనంగా జరిగింది ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు.. రాజకీయ నాయకులు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఈ పెళ్లికి సంబంధించి రాయల్ హ్యాట్రిక్ హాస్పిటాలిటీ.. విలాసవంతమైన ఏర్పాట్లు.. కళ్ళు చెదిరే విధంగా ఉన్నాయాట. వ్యాపార వర్గాల్లో… రాజకీయ వర్గాలను ఇది చర్చకు దారితీస్తోందట. దీనికి సంబంధించి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం..

కేవలం వచ్చిన గిఫ్ట్ లకు సర్వ్ చేసిన మద్యం విలువ దాదాపు 120 కోట్లట. జగన్ సోదరుడు అనిల్ కుమార్ రెడ్డికి మనదేశంలోనే కాకుండా.. అంతర్జాతీయంగా భారీగా మద్యం వ్యాపారాలు ఉన్నాయి. ఆఫ్రికా దేశాలలో అనేక ప్రాంతాలలో ఈయనకు భారీ ఎత్తున మద్యం తయారీ.. సరఫరా వ్యాపారాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్.. తమిళనాడు.. కర్ణాటక.. తెలంగాణ వంటి రాష్ట్రాలలో ఈయనకు మద్యం వ్యాపారాలు విస్తృతంగా ఉన్నాయి. మద్యం పరిశ్రమ మీద ఈయన పూర్తి స్థాయిలో పట్టు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా సంబంధాలు ఉన్నాయి.

తన కుమార్తె పెళ్లి వేడుక కోసం వచ్చిన వేడుకకు సర్వ్ చేయడానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన.. అత్యంత అరుదైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని ది విస్కీ ఎక్స్ఛేంజ్.. లండన్ లోని ప్రముఖ హారోడ్స్.. లోయిస్ XIII బోటిక్ ఎట్ హారోడ్స్ ద్వారా ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తెప్పించాలని సమాచారం. ఇక ఈ వేడుకలో వైన్, శాంపైన్, విస్కీ, బ్రాందీ వంటి బ్రాండ్‌లను కూడా అందుబాటులో ఉంచారు.

ఇక ప్రపంచంలోనే అత్యంత అరుదైన.. పాతకాలపు కాగ్నాక్ బ్రాండ్‌లను అందుబాటులో ఉంచారు. వీటి ధర కోట్లలో ఉంటుంది.

అత్యంత చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్న.. ఖరీదైన ఫ్రెంచ్ కాగ్నాక్.. లగ్జరీ లిక్కర్ కు చిరునామాగా నిలిచే ప్రీమియం బ్రాండ్లను గెస్ట్ ల కోసం తెప్పించారు.

రేర్ సింగల్ మల్టీ విస్కీ ని కూడా అందుబాటులో ఉంచారు.. పింక్ గోల్డ్ కేసింగ్ తో వచ్చే ఆరు లీటర్ల లిమిటెడ్ ఎడిషన్ రాయల్ షాంపైన్ ను గెస్ట్ ల కోసం సర్వ్ చేశారు.

ఈ వేడుకకు జగన్.. కేటీఆర్.. విజయ్.. గౌతమ్ ఆదాని వంటి వారు నటిస్తున్నారు. పెళ్లికి వచ్చిన వారందరికీ రాయల్ ట్రీట్మెంట్ అందించారు. వాస్తవానికి ఈ స్థాయిలో లిక్కర్ సర్వ్ చేయడంతో ఈ పెళ్లి చర్చకు దారితీస్తోంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird