Home తెలంగాణ KTR: కేటీఆర్ గడ్డం అందుకే పెంచుతున్నారట.. అసలు నిజం – Andhra Waves

KTR: కేటీఆర్ గడ్డం అందుకే పెంచుతున్నారట.. అసలు నిజం – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


KTR:కేటీఆర్.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా.. ఇలా అనేక పాత్రలను పోషించారు. ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా.. గులాబీ పార్టీకి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. కేటీఆర్ పేరు గుర్తుకొస్తే నీట్ షేవ్ తో కనిపిస్తారు. విదేశాలకు వెళ్ళినప్పుడు సూటు బూటు ధరించి కనిపిస్తారు. హ్యాండ్సమ్ లుక్ లో కనిపించే కేటీఆర్ ఇప్పుడు మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. గడ్డం.. మీసాలు పెంచి ఎప్పుడూ చూడని విధంగా రగ్ డ్ లుక్ […]

కేటీఆర్:కేటీఆర్.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా.. ఇలా అనేక పాత్రలను పోషించారు. ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా.. గులాబీ పార్టీకి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. కేటీఆర్ పేరు గుర్తుకొస్తే నీట్ షేవ్ తో కనిపిస్తారు. విదేశాలకు వెళ్ళినప్పుడు సూటు బూటు ధరించి కనిపిస్తారు.

హ్యాండ్సమ్ లుక్ లో కనిపించే కేటీఆర్ ఇప్పుడు మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. గడ్డం.. మీసాలు పెంచి ఎప్పుడూ చూడని విధంగా రగ్డ్ లుక్ లో దర్శనమిస్తున్నారు. కేటీఆర్ అలా కనిపించడం వెనక కూడా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా చర్చ నడుస్తోంది. కొద్దిరోజుల క్రితం కేటీఆర్ పెంచిన గడ్డం, మీసం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయనను ట్రోల్ చేశారు. గడ్డాలు, మీసాలు పెంచడానికి భారీగా డబ్బు ఖర్చుపెట్టారని పలువురు కేటీఆర్. దీని కోసం ఆయన రకరకాల సర్జరీలు చేసుకున్నారని.. అయితే ఇందులో కొన్ని విఫలమైనట్టు కాంగ్రెస్ నాయకులు మీడియా ముందు ప్రదర్శించారు. సంబంధిత కేటీఆర్ కోర్టు వరకు వెళ్లారు. కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు కూడా తెచ్చుకున్నారు.

కేటీఆర్ గడ్డాలు, మీసాలు పెంచి జనాల్లోకి వస్తున్నారు. ఆయన లుక్ ను గులాబీ పార్టీ నాయకులు పాజిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. కొత్త లుక్ లో కేటీఆర్ సరి కొత్తగా కనిపిస్తున్నారు. అయితే కేటీఆర్ గడ్డం, మీసాలు పెంచడం వెనక అసలు స్టోరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటపెట్టారు. కేటీఆర్ ఆమధ్య వ్యక్తులతో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టారట. ఆ సమయంలో రేవంత్ రెడ్డి కంటే నాకెం తక్కువ అన్నారట. దానికివారు సార్ మీకు మీసం లేదు.. గడ్డం కూడా లేదు అన్నారట. అప్పటినుంచి కేటీఆర్ గడ్డాలు.. మీసాలు పెంచడం మొదలుపెట్టారట. ఇదే పరిశీలన రేవంత్ రెడ్డి శనివారం జరిగిన ఓ సభలో బయటపెట్టారు. “పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే.. ఆ తర్వాత దెబ్బ తినేది నక్క మాత్రమే అని.. వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క ఎన్నటికీ పులి కాదని” రేవంత్ రెడ్డి.

గడ్డాలు.. మీసాలు పెంచినంత మాత్రాన కేటీఆర్ ఎన్నటికీ రేవంత్ రెడ్డి కాలేడని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ ను ఉద్దేశించి ఈ స్థాయిలో విమర్శలు చేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరి గులాబీ కేటీఆర్ పార్టీ ఎలా స్పందించారు.. నాయకులు ఎలాంటి కౌంటర్ ఇస్తారు. ఇటీవల కాలంలో తనను ఉద్దేశించి వ్యక్తిగతంగా ఎవరూ విమర్శలు చేయకూడదని కేటీఆర్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. మరి ఇలాంటి అప్పుడు కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ విమర్శలు చేశారు. ఈ సమయంలో రేవంత్ కు ఎలాంటి సమాధానం చెబుతారు.. ఏ రూపంలో చెబుతారు.. అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird