
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. రూ.800 కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలో అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది.
‘జైలర్ 2’ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నవంబర్ 12 నుంచి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే థియేటర్లలో విడుదలైనప్పుడు నిడివి కొన్ని సన్నివేశాలను కట్ చేశారనే ప్రచారం జరిగింది. దీనితో ఓటీటీలో అయినా ఆ తొలగించిన సన్నివేశాలను జోడిస్తారని అభిమానులు ఆశించారు. ముఖ్యంగా మిస్ అయిన కీలక ఫుటేజ్‌ను ఓటీటీ వెర్షన్‌లో చూడొచ్చని భావించారు.
కానీ ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం అభిమానులకు షాక్ ఇచ్చేలా ఉంది. థియేటర్లలో ‘జైలర్ 2’ 165 నిమిషాలుగా ఉండగా.. రన్ ఓటీ వెర్షన్ నిడివి 163 నిమిషాలు చూపిస్తుంది. అంటే థియేటర్లలో చూసిన దానికంటే ఓటీటీలో మరో రెండు నిమిషాలు తక్కువగా ఉండనుంది.

అదనపు సన్నివేశాలు వస్తాయని ఎదురుచూసిన అభిమానులకు.. ఉన్న నిడివిలోనూ రెండు నిమిషాలు తగ్గించడం నిరాశ కలిగించే విషయమే. అయితే ఈ రెండు నిమిషాలు ఏ సన్నివేశాలకు సంబంధించినవి? ఓటీటీ వెర్షన్‌లో ఎలాంటి మార్పులు చేశారు? అనే స్పష్టత రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: 30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.?
రజినీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’కు సీక్వెల్ కావడంతో ‘జైలర్ 2’పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం, రజినీ స్టైల్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సన్ పిక్చర్స్ ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మించింది.

థియేటర్లలో మిస్ అయిన సీన్లను ఓటీటీలో చూడొచ్చని ఆశించిన అభిమానులకు ఇప్పుడు రన్‌టైమ్ సమాచారం నిరాశ కలిగిస్తోంది. మరి నవంబర్ 12న స్ట్రీమింగ్ మొదలైన తర్వాత ఈ మార్పులపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
రామ్ చరణ్ ‘RC17’లో రిషికాంత్?.. పూజకు వెళ్లిన అసలు కారణం చెప్పేశాడు.!
హారిక హాసినితో త్రివిక్రమ్ బంధం తెగిపోనుందా?.. గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి.?
[Jailer 2 OTT Release, Jailer 2 OTT Runtime, Jailer 2 OTT Update, Rajinikanth Jailer 2, Jailer 2 Movie, Amazon Prime Video, Rajinikanth, Nelson Dilipkumar, Anirudh Ravichander]
