Home తెలంగాణ బతుకమ్మ 2026: ఈసారి బతుకమ్మకు కరువు వచ్చింది – Andhra Waves

బతుకమ్మ 2026: ఈసారి బతుకమ్మకు కరువు వచ్చింది – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


బతుకమ్మ 2026: తంగేడు పువ్వులు ఏవీ.. అసలు తంగేడు చెట్లు ఏవీ.. కొండలు.. గుట్టలు మైనింగ్ మాఫియాకు హారతి కర్పూరం అయ్యాయి. గునుగు పూలు కాలగర్భంలో కలిసిపోయాయి. కట్ల పువ్వులు కనిపించడం మానేశాయి. గుమ్మడి పువ్వుల్లో ఉండే సహజసిద్ధమైన గౌరమ్మ కనిపించినంత దూరం వెళ్లిపోయింది. ఇప్పుడు మొత్తం రెడీమేడ్ బతుకమ్మ. డీజే చప్పుళ్ల మధ్య అస్తిత్వాన్ని కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర పండగ. చదువుతుంటే ఇబ్బందిగా ఇది నిష్టూరు సత్యం. బతుకమ్మ అంటేనే ఒక […]

బతుకమ్మ 2026: తంగేడు పువ్వులు ఏవీ.. అసలు తంగేడు చెట్లు ఏవీ.. కొండలు.. గుట్టలు మైనింగ్ మాఫియాకు హారతి కర్పూరం అయ్యాయి. గునుగు పూలు కాలగర్భంలో కలిసిపోయాయి. కట్ల పువ్వులు కనిపించడం మానేశాయి. గుమ్మడి పువ్వుల్లో ఉండే సహజసిద్ధమైన గౌరమ్మ కనిపించినంత దూరం వెళ్లిపోయింది. ఇప్పుడు మొత్తం రెడీమేడ్ బతుకమ్మ. డీజే చప్పుళ్ల మధ్య అస్తిత్వాన్ని కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర పండగ.

చదువుతుంటే ఇబ్బందిగా ఇది నిష్టూరు సత్యం. బతుకమ్మ అంటేనే ఒక ఆస్తిత్వం. బతుకమ్మ అంటేనే సంస్కృతికి నిలువైన అర్థం. అందుకే కదా బతుకమ్మను తెలంగాణ ప్రజలు గర్వంగా జరుపుకునేది. గొప్పగా చేసుకునేది. పూలను పేర్చి.. చేతిలో పట్టుకొని.. ఒక్కో పువ్వేసి చందమామ.. అని ఆడపిల్లలు పాటలు పాడుతుంటే.. ఆ తన్మయత్వం మాటలకు అందేది కాదు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మాయమైపోయింది.

పల్లెల్లో తంగేడు చెట్లు కాలగర్భంలో కలిసిపోయాయి. కట్ల పూల నుంచి మొదలు పెడితే గుమ్మడి పూల వరకు అన్ని విలుప్తమయ్యాయి. అభివృద్ధి మోజులో పడి పంట పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లయ్యాయి. గుట్టలు.. కొండలు కరిగిపోయాయి. గ్రానైట్ మాఫియా వల్ల కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక తంగేడు చెట్లు ఎక్కడ ఉంటాయి.. గునుగు పూలు ఎక్కడ కనిపిస్తాయి. గుమ్మడి పూలు ఎలా వికసిస్తాయి. పూలు లేని సంబరం బతుకమ్మ ఎలా అవుతుంది.. బతుకమ్మ అంటేనే పూల సింగిడి కదా. అస్తిత్వం కోల్పోయిన తర్వాత అది పండగ ఎలా అవుతుంది..

ఇప్పుడు బతుకమ్మ అంటే రెడీమేడ్ బంతిపూలు.. డీజే చప్పుళ్ళు. గౌరమ్మను మర్చిపోయి మంగ్లీ పాటలతో స్టెప్పులు వేసే రోజులు.. ఇది కాదు కదా మన కల్చర్.. ఇది కాదు కదా తెలంగాణ సంస్కృతి. వెనుకటి కాలంలో మన అమ్మలక్కలు బతుకమ్మ అంటే ఇతడు తాంబాళంలో.. అడుగున గుమ్మడి ఆకులు వేసి.. తంగేడు పువ్వును రెండు వరసలు పేర్చి.. ఆ తర్వాత గునుగు పువ్వు.. కట్లపువ్వు.. టేకు పువ్వు.. ఇలా రకరకాల పువ్వులను పేర్చి.. బతుకమ్మను పూజించేవారు. చెరువు దగ్గరికి వెళ్లి.. రేగడి మట్టి తెచ్చి.. దానిమీద వెంపలి చెట్టును ప్రతిష్టించి.. బతుకమ్మకు పూజలు చేసేవారు. అమ్మలక్కలు పాడుతూ ఉంటే గౌరమ్మ కూడా తన్మయత్వం చెందేది. అలా ఉండేది మరి పల్లె పాట.. బతుకమ్మ పాట.. పైగా ఈ ఏడు కరవు ఉండటంతో బతుకమ్మ మరింత కళకళలాడింది.

మార్పు మంచిదే. ప్రతి రంగంలోనూ అభివృద్ధి ఉండాలి. కానీ మన అస్తిత్వం ప్రమాదంలో పడే స్థాయిలో అభివృద్ధి ఉండకూడదు. దానివల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే.. మన గమనాన్ని.. మన చరిత్రను.. మన సంస్కృతిని.. మన వారసత్వాన్ని వచ్చేతరాలు మర్చిపోతాయి. ఒక జాతి చరిత్ర మరుపునకు కనిపిస్తుంది అంటే అంతకుమించిన దరిద్రం మరొకటి ఉండదు. కళ్ళముందే ఇంత విద్వంసం చేస్తున్న అభివృద్ధి.. ఇంతటి మార్పు.. మనకు అవసరమా.. ఆలోచించుకుంటే సమాధానం దొరుకుతుంది. తిరిగి వెనక్కి వెళ్తే మన బతుకమ్మ సజీవంగా కనిపిస్తుంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird