ఓటీటీలో కొత్త సినిమాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ఓ ఫన్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందుబాటులో ఉంది. అదే తమిళ చిత్రం ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో తెలుగమ్మాయి శాన్వీ మేఘన హీరోయిన్‌గా నటించడం మరో విశేషం. మరి ఈ సినిమా కథేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో పూర్తి వివరాలు ఓ లుక్ వేయండి..
ఈ సినిమా కథ విషయానికొస్తే.. సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయి తన పుట్టింటిని వదిలి అత్తారింటికి వెళ్తుంది. కానీ ఈ సినిమాలో అందుకు భిన్నంగా కథ సాగుతుంది. పావి అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన పెళ్లి తర్వాత తల్లిదండ్రులను వదిలి వెళ్లడానికి ఇష్టపడదు. దీంతో ఆమె భర్త ఎలా ఉన్నా అత్తారింటికి వెళ్లి ఉండాల్సి వస్తుంది.
అక్కడ కొత్త కుటుంబం, కొత్త అలవాట్లు, భిన్నమైన ఆలోచనల మధ్య అతడికి అనేక సరదా పరిస్థితులు ఎదురవుతాయి. అత్తమామలతో కలిసి జీవించడం, కుటుంబ సభ్యుల అంచనాలను అర్థం చేసుకోవడం, భార్యాభర్తల మధ్యతను కాపాడుకోవడం వంటి అంశాల చుట్టూ కథ సాగుతుంది. చివరకు ఈ కొత్త కాపురం ఎలా సాగింది? అనేది మిగిలిన కథ. ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా ఆగస్టు 21న నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఆడియో అందుబాటులో ఉంది. సుమారు రెండు గంటల ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా రొమాన్స్, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో సాగుతుంది. వీకెండ్‌లో కుటుంబంతో కలిసి ఓ సరదా సినిమా చూడాలనుకునేవారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్. ఇంకా ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి.
మరిన్ని ఓటిటి అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
