.webp)
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రభావం వైసీపీపై ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ముందు నుంచి కూడా విజయసాయి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో విజయసాయి సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నారు.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు తెరతీసింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన విజయసాయి, ఇప్పుడు పరివర్తన రాజనీతి పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని కలిగి ఉన్నారు.
దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా తన పార్టీ పనిచేస్తుందని విజయసాయి పార్టీ ప్రకటన సందర్భంగా తెలిపారు. పార్టీ అధికారిక ప్రకటనతో పాటు జెండాను కూడా ఆవిష్కరించిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని తీసుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడమే తమ లక్ష్యమని నిదర్శనం.
.webp)
ఈ పరిణామం వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంశంపై సర్వత్రా ఆసక్తి ఉంటుంది. అదే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకంగా, పార్టీ నేతకు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకోవడం ఆ పార్టీకి ఏదో విధంగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమౌతోంది.
ఇది కూడా చదవండి: జయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!
పార్టీలో అసంతృప్తితో ఉన్న, అలాగే ఆయనతో సత్సంబంధాలు కలిగిన కొందరు నేతలు భవిష్యత్తులో వైసీపీని వీడి విజయసాయి పంచన చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అదాలా ఉంచితే.. కొత్త పార్టీ ద్వారా ఆయన ఏ మేరకు ప్రభావం చూపుతారు, ప్రజాదరణను ఏ విధంగా సంపాదించుకుంటారు అనే విషయంలో కూడా రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
.webp)
రానున్న కాలంలో విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) ప్రయాణం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చెప్పిన ముహూర్తానికి చెప్పినట్లుగా తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విజయసాయి, ముందు ముందు రాష్ట్ర రాజకీయాలలో ఏ ప్రభావం చూపుతారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్త మౌతోంది.
మీకు నచ్చవచ్చు: వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి
విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.?
[Effect of Vijayasai Reddy New Party onYCP, Parivarthana Rajaneethi Party, PRP, Political Impact, AP Politics, Telugu One]
