Home సినిమా అనిరుధ్, కావ్య పెళ్లి వీడియో చూసి షాకవుతున్న ఫ్యాన్స్.. అందులో ఏముందంటే? – Andhra Waves

అనిరుధ్, కావ్య పెళ్లి వీడియో చూసి షాకవుతున్న ఫ్యాన్స్.. అందులో ఏముందంటే? – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ వివాహం ప్రస్తుతం సినీ, క్రీడాకారుల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి పెళ్లి వేడుకలు గ్రీస్‌లో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనిరుధ్, కావ్య పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

వైరల్ అవుతున్న ఒక వీడియోలో అనిరుధ్ బ్లాక్ కలర్ టాక్సీడోలో కనిపించింది, కావ్య మారన్ ఎరుపు రంగు పెళ్లి దుస్తుల్లో కనిపించింది. ఇద్దరూ చేతులు పట్టుకుని నడుస్తూ, తమ చేతులకు ఉన్న ఉంగరాలను చూపిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. సముద్రంలో అందమైన వాతావరణం మధ్య ఈ దృశ్యాలు ఉండటంతో చాలామంది ఇది వారి పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో అని భావించారు.

మరో వీడియోలో అనిరుధ్, కావ్యకు డైమండ్ రింగ్ తొడుగుతున్నట్లుగా కనిపిస్తున్నారు. గ్రీక్ అందాల మధ్య సాగిన ఈ ప్రపోజల్ వీడియో కూడా నెత్తింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోలను నిజమైన పెళ్లి లేదా ప్రపోజల్ దృశ్యాలుగా భావించడం సరికాదని ఫ్యాన్ పేజీలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ప్రపోజల్ వీడియో ఐ సాయంతో రూపొందించినదేనని సంబంధిత పోస్టులోనే క్లారిటీ ఇచ్చారు.

అనిరుధ్, కావ్యల వివాహం నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. అనిరుధ్‌కు మేనమామ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు వెళ్లినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: సమంత డెలివరీ అయిపోయిందని నమ్మిన బామ్మ.. నటి సమాధానం వింటే నవ్వాల్సిందే!

ఇక ఈ జంట వివాహ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో నిర్వహించబడిన వివాహ సమాచారం. ఈ సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే రిసెప్షన్ ఇన్విటేషన్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అనిరుధ్ ‘3’ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి డి’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగారు. మరోవైపు కావ్య మారన్ సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్వహణలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి వివాహానికి సంబంధించిన వార్తలతో పాటు సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

మీకు నచ్చవచ్చు:

పెళ్లయ్యాక అలాంటి పాత్రలు చేయకూడదా? కియారా విషయంలో సిద్ధార్థ్ ఏమన్నారంటే.!

రమనుడికి పట్టాభిషేకం చేసిన సౌత్ ప్రేక్షకులు: కలెక్షన్స్ ఇవే.!

[Anirudh Ravichander, Kavya Maran, Anirudh Kavya Wedding, Anirudh Wedding Video, Kavya Maran Wedding, Anirudh AI Video, Anirudh Kavya Viral Video]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird