Kota Vinutha: అప్పట్లో వ్యక్తిగత సహాయకుడు.. డ్రైవర్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చారు శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జ్ కోట వినుత. ఆ తర్వాత ఆమె రాజకీయంగా అంత యాక్టీవ్ గా లేదు. ఆమె భర్త చంద్రబాబు డ్రైవర్ హత్య కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కోట వినుత వ్యవహారం బయటికి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరంగా […]
Kota Vinutha: అప్పట్లో వ్యక్తిగత సహాయకుడు.. డ్రైవర్ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చారు శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జ్ కోట వినుత. ఆ తర్వాత ఆమె రాజకీయంగా అంత యాక్టీవ్ గా లేదు. ఆమె భర్త చంద్రబాబు డ్రైవర్ హత్య కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కోట వినుత వ్యవహారం బయటికి వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పారు.
సరిగ్గా ఇన్నాళ్లకు కోట వినుత మళ్లీ తన సోషల్ మీడియాలో ఒక కీలకమైన వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె చెప్పిన మాటలు సంచలనంగా ఉన్నాయి. “నేను కూటమి కోసం సీటు త్యాగం చేశాను.. మా సొంత ఊరు రేణిగుంట మేజర్ పంచాయతీ సర్పంచ్ గా జనసేన నుంచి మా అమ్మ నగరం జయలలిత పోటీ చేస్తున్నారు.
గతంలో డ్రైవర్ హత్య కేసు సమయంలో కూడా వినుత సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఇందులో ఉంది. అంతేకాదు నిజాలు త్వరలోనే బయటపడతాయని ఆమె చెప్పింది. జైలు నుంచి విడుదలైన తర్వాత జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గురించి మెరకే ఆమె పొలిటికల్ గా యాక్టీవ్ అయ్యారని. రేణిగుంట మేజర్ పంచాయతీలో విననత తల్లి పోటీ చేస్తున్నారు. ఆమె అధికారికంగా జనసేన నుంచి పోటీలో ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలం వల్లే రెబల్ పోటీలో ఉన్నారని వినత ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.. చంద్రబాబు.. నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యేలకు ఏమైనా సూచనలు చేస్తారా.. కూటమి ధర్మం ప్రకారం సర్పంచ్ పోటీలో ఉన్న అభ్యర్థులకు పోటీగా రెబల్స్ ఉండకూడదని నిర్ణయించారు. మరి రేణిగుంట సర్పంచ్ స్థానం విషయంలో ఏం చేస్తారో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నేను గెలుపు కోసం ఎమ్మెల్యే సీటు కూటమి చేశాను. మా సొంత ఊరు రేణిగుంట మేజర్ పంచాయతీ సర్పంచ్ జనసేన పార్టీ మా అమ్మ నగరం జయలలిత గారు ఆఫీషియల్ గా పోటీలో పాల్గొంటారని పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తే స్థానిక టీడీపీ MLA సహకరించకుండా రెబల్ నిలబెట్టడం కరెక్ట్ కాదు.
@naralokesh గారు, @ncbn గారికి విన్నపం, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించాలని, మీ సహకారం కావాలని కోరుకుంటున్నాను.
మీ
వినుత కోట
@JanaSenaParty @PawanKalyan
— Vinutha Kotaa (@VinuthaKotaa) నవంబర్ 20, 2026
