.webp)
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రీ దేవి 91 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్ జిల్లాలో ఉన్న తమ స్వగ్రామం పంచూర్‌లోని నివాసంలో గురువారం (నవంబర్ 20) తుది శ్వాస విడిచారు. వయోభారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ఉన్నారు.
సావిత్రీదేవి మరణ వార్తతో పంచూర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సావిత్రి దేవి మరణించిన పౌరీ గడ్వాల్ఎస్ఎస్పీ అధికారికంగా ధ్రువీకరించారు. ఆమె భౌతికకాయానికి శనిక్రవారం (నవంబర్ 21) ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అంత్యక్రియలు నిర్వహించబడతాయి. సావిత్రి దేవి మరణవార్తపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం యోగి ఆదిత్యనాథ్ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. సావిత్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని కుటుంబానికి ప్రసాదించాలని కేదార్నాథ్ స్వామిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
.webp)
ఇలా ఉండగా తల్లి మరణవార్త తెలిసినప్పటికీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత శోకాన్ని గోరఖ్‌పూర్‌లో ముందుగా ఖరారైన అధికారిక షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అంత్యక్రియల సమయంలో భద్రతా, ఇతర ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. సావిత్రి దేవి మృతి పట్ల సంతాపాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, కుటుంబానికి మనోధైర్యం చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు.
[Yogi Adityanath, Mother, Savitri Devi, Nomore, Panchur village, funeral Haridwar, Pushkar Singh Dhami, Condole, TeluguOne]
