Home ఆంధ్రప్రదేశ్ YS Jagan Sakshi Newspaper : చంద్రబాబుతో చెట్టాపట్టాలా? సాక్షి కథనంపై షర్మిల తీవ్ర ఆగ్రహం.. జగన్‌కు సూటి ప్రశ్నలు.. – Andhra Waves

YS Jagan Sakshi Newspaper : చంద్రబాబుతో చెట్టాపట్టాలా? సాక్షి కథనంపై షర్మిల తీవ్ర ఆగ్రహం.. జగన్‌కు సూటి ప్రశ్నలు.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


YS Jagan Sakshi Newspaper : కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడంపై సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండించిన వైఎస్ షర్మిల.. జగన్, వైసీపీ నాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఒక మహిళగా తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనం రాశారని ఉంది. గతంలో వైఎస్సార్ కూడా చంద్రబాబును కుటుంబ వేడుకలకు ఆహ్వానించారని గుర్తుచేస్తూ వైసీపీకి పలు ప్రశ్నలు సంధించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబం చుట్టూ వివాదం రాజుకుంది. వైఎస్ షర్మిల కుమార్తె వివాహ ఆహ్వానం ఇప్పుడు రాజకీయ విమర్శలకు కేంద్రబిందువైంది. తన కుమార్తె పెళ్లికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడాన్ని ప్రస్తావిస్తూ సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ కథనం తన వ్యక్తిత్వంతో పాటు తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెళ్లి పిలుపులోనూ రాజకీయ కోణమా?

కుటుంబంలో జరిగే శుభకార్యాలకు రాజకీయ నాయకులను ఆహ్వానించడం సాధారణమైన విషయమే. అయితే తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించడాన్ని కూడా రాజకీయ కోణంలో విశ్లేషిస్తూ, వ్యక్తిగత సంబంధాలకు తప్పుడు అర్థాలు ఆపాదించడాన్ని షర్మిల ప్రశ్నించారు.

తండ్రి వయసున్న వ్యక్తికి వివాహ ఆహ్వాన పత్రిక అందిస్తే చెట్టాపట్టాలంటూ కథనాలు రాయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఒక ఆడబిడ్డపై ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం విలువలకు విరుద్ధమని.

జగన్, వైసీపీపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

ఈ వ్యవహారంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు షర్మిల. మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పుకునే పార్టీ, తనకు సంబంధించిన విషయంలో మాత్రం ఇలాంటి కథనాలను ఎలా సమర్థించుకుంటామని ప్రశ్నించారు.

తనపై, తన కుటుంబంపై వ్యక్తిత్వ హననం జరిగేలా కథనం ప్రచురించారని. మహిళలపై తప్పుడు ప్రచారం చేయడం, వ్యక్తిగత సంబంధాలకు వక్రభాష్యాలు చెప్పడం వైసీపీ రాజకీయ సంస్కృతిగా మారిందంటూ.

వైఎస్సార్ గతాన్ని గుర్తుచేసిన షర్మిల

తన వాదనకు బలం చేకూర్చేలా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడిని కుటుంబ వివాహ వేడుకలకు ఆహ్వానించిన షర్మిల ప్రస్తావించారు.

రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ వ్యక్తిగతంగా కుటుంబ సంబంధాలు, ఆత్మీయతలు కొనసాగడం సహజమని ఆమె అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కూడా చంద్రబాబును తన పిల్లల వివాహాలకు ఆహ్వానించారని, అలాంటప్పుడు ఆయనకు చంద్రబాబుతో ప్రత్యేక సంబంధాలు అంటగడతారా? అని ప్రశ్నించారు.

రాజకీయాలను వ్యక్తిగత జీవితాల్లోకి తీసుకురావడం సరికాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సాక్షి వివరణ ఇవ్వాలంటూ డిమాండ్

ఈ కథనానికి సంబంధించి జగన్‌తో పాటు సాక్షి యాజమాన్యం కూడా సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఒక మహిళ వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా కథనాలు రాయడం పత్రికా ధర్మమా? అని ప్రశ్నించారు.

తనపై వచ్చిన కథనానికి సాక్షి వివరణ ఇస్తుందా? లేక జగన్ స్వయంగా వ్యవహరిస్తున్నారా? అని నిలదీశారు.

మొత్తానికి, కుమార్తె వివాహ ఆహ్వానంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు జగన్, షర్మిల మధ్య రాజకీయ విమర్శలకు మరో వేదికగా మారింది. కుటుంబ సంబంధాలు, రాజకీయ విభేదాలు, మీడియా కథనాల చుట్టూ సాగుతున్న ఈ మాటల యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird