Home ఆంధ్రప్రదేశ్ Mukka Sravani: కూతురి విజయమే ఆయన ఊపిరి – Andhra Waves

Mukka Sravani: కూతురి విజయమే ఆయన ఊపిరి – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


ముక్క శ్రావణి: విశాఖపట్నం నగర ప్రధమ పౌరురాలు.. జీవీసీ మేయర్ ముక్క శ్రావణి ఇంట్లో తీవ్ర విషాదం. ఆమె రాజకీయ ఓనమాలు దిద్దడంలో.. ఆమె రాజకీయంగా ఎదగడంలో వెన్ను తట్టి నడిపించిన కన్న తండ్రి.. సీనియర్ టిడిపి నాయకుడు ముక్కా ముత్యాల నాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. ఒకవైపు తన కుమార్తె నగర మేయర్ గా అత్యున్నత పీఠాన్ని అధిష్టించిందన్న ఆనందంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఊహించని ఘోర విషాదం శోకసముద్రంలో ముంచింది. ముత్యాల నాయుడు టిడిపిలో […]

ముక్క శ్రావణి: విశాఖపట్నం నగర ప్రధమ పౌరురాలు.. జీవీసీ మేయర్ ముక్క శ్రావణి ఇంట్లో తీవ్ర విషాదం. ఆమె రాజకీయ ఓనమాలు దిద్దడంలో.. ఆమె రాజకీయంగా ఎదగడంలో వెన్ను తట్టి నడిపించిన కన్న తండ్రి.. సీనియర్ టిడిపి నాయకుడు ముక్కా ముత్యాల నాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. ఒకవైపు తన కుమార్తె నగర మేయర్ గా అత్యున్నత పీఠాన్ని అధిష్టించిందన్న ఆనందంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఊహించని ఘోర విషాదం శోకసముద్రంలో ముంచింది.

ముత్యాల నాయుడు టిడిపిలో సీనియర్ నాయకుడు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల మనిషి. 1983లో టిడిపి ఆవిర్భావం నుంచి ఆయన ఆ పార్టీకి వీర విధేయుడిగా కొనసాగుతున్నారు. నిఖార్సయిన కార్యకర్తగా సేవలో అందించారు. దివంగత పార్లమెంట్ సభ్యుడు ఎన్వీఎస్ మూర్తికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. విశాఖపట్నంలో పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. ఆయన నిబద్ధతకు గుర్తింపుగా 2007లో కార్పొరేటర్ గా టిడిపి అవకాశం కల్పించింది. నాటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆయన భార్య ఈశ్వరి కూడా 2007లో కార్పొరేటర్ గా పోటీ చేసి.. విజయం సాధించారు.

ఒక తండ్రి తన పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలి అని అనుకుంటారు. దీనికి ముత్యాల నాయుడు మినహాయింపు కాదు. వృత్తిరీత్యా వైద్యుడు అయిన ముత్యాలనాయుడు.. తన కుమార్తె శ్రావణిని ప్రజాసేవ వైపు ప్రోత్సహించారు. ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2021లో ఆమె 26వ వార్డు నుంచి కార్పొరేటర్ గా గెలిచినప్పుడు.. ముత్యాల నాయుడు పాడిన ఆనందం మామూలుది కాదు. ఇటీవల జరిగిన జీవీసీ ఎన్నికలలో శ్రావణి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఏకంగా రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీ తేడాతో విశాఖ మేయర్ అభ్యర్థిగా విజయం సాధించారు. మొత్తంగా ముత్యాల నాయుడు తన బిడ్డ నగరం మేయర్ కావాలి అని కలలు కన్నారు.. చివరికి దానిని నెరవేర్చుకున్నారు. “నా కుమార్తె విశాఖ నగర మేయర్ అయింది” అని మురిసిపోయిన ముత్యాలనాయుడు కళ్ళల్లో ఆనందం ఎంతో కాలం నిలవలేదు. విశాఖపట్నం ప్రధమ పౌరురాలిగా తన కూతురు నగరానికి చేసే సేవను కలరా చూసుకునే అదృష్టం ఆయనకు దక్కకుండానే పోయింది. క్రూరమైన విధి ఆయనను గుండెపోటు రూపంలో బలితీసుకుంది. ముత్యాల నాయుడు మరణం పట్ల విశాఖపట్నంలో రాజకీయ ప్రముఖులు.. పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. కష్టకాలంలో శ్రావణి కుటుంబం ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird