Home ఆంధ్రప్రదేశ్ Punganur Stone Pelting: పుంగనూరు రాళ్లదాడి.. కర్ణాటక గుండాలను – Andhra Waves

Punganur Stone Pelting: పుంగనూరు రాళ్లదాడి.. కర్ణాటక గుండాలను – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


పుంగనూరు స్టోన్ పేల్టింగ్: లిక్కర్ కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయాడు వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. స్థానికంగా కూసాలు కదిలిపోయే అవకాశం ఏర్పడింది. పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. పోటీ చేసే ఆ కాస్త మందికి ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం మిథున్ రెడ్డి మీద ఉంది. పైగా సొంత గడ్డమీద టిడిపి దూకుడు కొనసాగుతోంది. 2019 నుంచి 2024 వరకు మిథున్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించుకుంటూ వెళ్లిపోయారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతున్న […]

పుంగనూరు రాళ్ల దాడి: లిక్కర్ కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయాడు వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. స్థానికంగా కూసాలు కదిలిపోయే అవకాశం ఏర్పడింది. పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. పోటీ చేసే ఆ కాస్త మందికి ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం మిథున్ రెడ్డి మీద ఉంది. పైగా సొంత గడ్డమీద టిడిపి దూకుడు కొనసాగుతోంది. 2019 నుంచి 2024 వరకు మిథున్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించుకుంటూ వెళ్లిపోయారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతున్న నేపథ్యంలో.. ఆయన మళ్లీ తన హింసాత్మక రాజకీయాలకు తెర తీశారు.

పుంగనూరులో నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత మిథున్ రెడ్డి హింస రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. అవసరం లేదు బల ప్రదర్శనకు దిగారు. నిజానికి స్థానిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద స్థాయి నాయకులు రారు. మధ్య లేదా దిగువ స్థాయి నాయకులు మాత్రమే వస్తారు. వారంతా నామినేషన్ల ప్రక్రియ.. ఆర్థిక సర్దుబాటు.. టికెట్ల కేటాయింపు.. ప్రచారం వంటి కార్యక్రమాలను పరిశీలించారు. కానీ మిథున్ రెడ్డి.. తన స్థాయిని తగ్గించుకొని బల ప్రదర్శన చేశారు. నిజానికి ఆయన అలా చేయాల్సిన అవసరం లేదు. పైగా స్థానిక నాయకులతో కాకుండా.. కర్ణాటక గుండాలను రంగంలోకి దింపారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఉప ఎన్నికల మాదిరిగా ఇతర రాష్ట్రాల నుంచి రౌడీలను.. గూండాలను మిథున్ రెడ్డి రంగంలోకి దింపారు.

పుంగనూరు ప్రాంతంలో ఒకప్పటి తన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇది తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం నచ్చలేదు. ఇంకేముంది మిథున్ రెడ్డికి గట్టిగా గుణపాఠం చెప్పారు. ముందుగా రౌడీలతో మిధున్ రెడ్డి టిడిపి కార్యకర్తలు దాడులు చేయించారు. అయితే ఆ దాడులకు టిడిపి కార్యకర్తలు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అంతకుమించిన స్థాయిలో తిరుగుబాటు కారణంగా. దీంతో మిధున్ రెడ్డి బాడుగకు తెచ్చుకున్న కిరాయి రౌడీలు.. గుండాలు వెనుకడుగు వేశారు. ఈ దాడిలో టిడిపి కార్యకర్తలకు గాయాలు అయినప్పటికీ.. రక్తం కారుతున్నప్పటికీ.. వారు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పైగా సొంత మీడియాలో మిథున్ రెడ్డి హత్యాయత్నం అంటూ నాటకాలు ఆడుతున్నారు.

మరో కోడి కత్తి.. గులకరాయిలాగా సెంటిమెంట్ పండిస్తున్నారు. కానీ ఇవి ఒకప్పటి రోజులు కాదు. జనం తెలివి మీద ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ప్రతి వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు కర్ణాటక గుండాలు.. కోడి కత్తి డ్రామాలు.. గులకరాయి సెంటిమెంట్లు వర్కౌట్ కావని టిడిపి నేతలు అంటున్నారు. కాబట్టి మిథున్ రెడ్డి ఇలా గూండాలాగా వ్యవహరిస్తున్నారని.. ప్రజలకు అంత తెలుసు కాబట్టి వారికి బ్రహ్మరథం పడుతున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird