.webp)
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత మండలిలో వైసీపీ పక్ష నేత అయిన బొత్స సత్యన్నారాయణ ప్రతిష్ఠ మసకబారిందా? సొంత జిల్లాలోనే పట్టు నిలుపుకోవడంలో విఫలమైన బొత్స సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా? సొంత జిల్లాలోనే ఆయన ఉత్సవ విగ్రహంగా మారారా? అంటే వైసీపీ నేతలే ఔనని అంటున్నారు. విజయనగరం జిల్లాలో ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాలు బొత్స ప్రతిష్టను బాగా మసకబార్చాయి. ఇక తాజాగా గురువారం (నవంబర్ 19) జరిగిన ఎంపీపీ ఎన్నికలలో మొత్తం 27 స్థానాల్లో వైసీపీ పాతిక స్థానాలను తెలుగుదేశం కోల్పోయింది. వైసీపీ కేవలం గురివిడి ఎంపీపీ మాత్రమే దక్కించుకోగలిగింది. మిగిలిన ఒక్క తెలుగుదేశం కూటమి భాగస్వామ్యపార్టీ అయిన జనసే గెలుచుకుంది.
ఈ ఫలితాలు బొత్స సత్యనారాయణకు వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ ఇబ్బందికరంగా పరిణమించాయి. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా, గురువారం (నవంబర్ 19) చేతులు ఎత్తే పద్ధతి ద్వారా మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. వైసీపీకి బలం ఉందని భావించిన చోట్ల సైతం టీడీపీ అభ్యర్థులు ఎంపీపీ పీఠాలను దక్కించుకోవడం బొత్సకు తేరుకోలేని షాక్‌గా మారింది. మరీ ముఖ్యంగా బొత్స సత్యనారాయణ నిర్వహిస్తున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లోనూ టీడీపీ అధికారం సాధించడం ఆయన రాజకీయ పలుకుబడికి చెల్లుచీటి రాసినట్లుగా అయ్యిందని సొంత పార్టీ శ్రేణులే అంటున్నాయి. మరోవైపు.. బొత్సకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బొంపల్లి వెంకట్రావు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన ప్రతిష్ఠాత్మకంగా దిగజారింది.
అలాగే ఇదే నెలలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ గెలుపొందిన వెంకట్రావు, పార్టీని వీడారు. తనకు వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పి బొత్స సత్యనారాయణ అన్యాయం చేశారని ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది. గతంలో తన కుమార్తె అనూషను గెలిపించుకోలేకపోయిన పార్టీ నేతలు, తాజాగా సొంత జిల్లాలో ఎంపీపీ స్థానాలను నిలువరించకపోవడం బొత్సకు సొంత జిల్లాలోనే ఆదరణ కరవైంది.

ఆరంభం నుంచి విజయనగరం జిల్లాపై బలమైన పట్టు కలిగిన నేతగా పేరున్న బొత్స ఇలాకాలోనే ఇలాంటి ఫలితాలు రావడం వైసీపీ శ్రేణులను సైతం విస్మయానికి గురిచేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో ప్రస్తుతం, బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలో వైసీపీకి ఎదురైన ఈ పరాజయం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమైంది. క్షేత్రస్థాయిలో మారిన, నేతల మధ్య ఏర్పడిన విభేదాలు ఎన్నికల ఫలితాలపై చూపిన చర్చ పోరందుకుంది.
ఇది కూడా చదవండి: వైసీపీలో బొత్స సినిమా అయిపోయిందా?
మండల పరిషత్ పీఠాలు చేజారిన నేపథ్యంలో విజయనగరం జిల్లాలో వైసీపీ తన బలాన్ని ఎలా పునర్నిర్మించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అసంతృప్తి నేతలను బుజ్జగించడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవడం వంటి విషయాలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల పాలన, మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలుపై కొత్తగా ఎన్నికైన ఎంపీపీలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజల దృష్టి నిలవనుంది.
.webp)
కాగా ఈ పరాజయం వైసీపీలో బొత్స భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే బొత్స అనుచరులు వరుసగా పార్టీని వీడుతుండటం, ఆయన వ్యతిరేకుల స్థాయిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటంతో జిల్లాలో ఆయనకు ఇక గడ్డు కాలమేనని అంటున్నారు. ఈ తాజా పరాజయంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనే ఆసక్తి సర్వత్రా చిత్రం.
మీకు నచ్చవచ్చు: బొత్స ఇలాకాలో వైసీపీ జీరో: వలసలు, సస్పెన్షన్లు.. అసలేం జరుగుతోంది.?
జనసేన గూటికి బొత్స కన్ఫర్మేనా?
[Botsa Satyanarayana, Pride Diminish, Vizianagaram MPP elections, Cheepurupalli Defeat, Bompalli Venkatrao, Resign, TeluguOne]
