Tirumala Water Crisis: తిరుమల.. నిత్యం వేలాదిమంది భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రం. ఇక్కడికి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు కనీస అవసరాలు కల్పించడం తిరుమల తిరుపతి దేవస్థానం ముందున్న ప్రధాన. ముఖ్యంగా ఏదైనా సరఫరా విషయంలో లోటు రాకుండా చూడాల్సి ఉంటుంది. అయితే ప్రకృతి సహకరించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో 1999 లో తిరుమల ఎదుర్కొన్న నీటి సంక్షోభం స్పష్టం చేసింది. అప్పట్లో గోగర్భం డ్యాం పూర్తిగా నిండిపోయింది. పాప వినాశనం డ్యామ్‌లో నీటి నిల్వలు కూడా అవసరాలకు సరిపోలేదు ఈ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తిరుమల నీటి సరఫరాలో కీలక మలుపుగా నిలిచింది అదే తిరుపతి సమీపంలోని కళ్యాణి యాం నీటి పంపిణీ ద్వారా తిరుమల కొండపైకి తీసుకెళ్లే పథకం.
1999 లో తిరుమల ప్రాంతంలో వర్షాలు కురువలేదు. టిటిడి అధికారిక ఇంజనీరింగ్ రికార్డుల ప్రకారం ఆ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణంగా కురవాల్సిన 379.8 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులుగా కేవలం 138.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే నమోదు అయింది. అంటే 63 శాతం లోటు ఏర్పడింది. దీనితో 1963-64లో నిర్మించిన గోగధం డ్యాం జూన్ 1999 నాటికి పూర్తిగా ఎండిపోయింది. పాప వినాశనం డ్యామ్ లో ఉన్న మీరు కూడా అవసరాలకు సరిపోలేదు. మరోవైపు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. నేటి అవసరాలు కూడా అదే స్థాయిలో పెరగడం మొదలైంది. ట్యాంకర్ల ద్వారా నీటిని కొండమీదికి తరలించడం అత్యంత ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. పైగా అది ప్రమాదకరమైనది కూడా. దీంతో ప్రత్యామ్నాయంగా నీటి వలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ క్రమంలో1999 నవంబర్ 6న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. తిరుమల కొండ మీద నీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు. దానికంటే ముందు నవంబర్ నాలుగో తేదీన అప్పటి దేవదాయ శాఖ మంత్రి తిరుమలలోని గోగర్భం.. ఆకాశగంగ.. పాప వినాశనం డ్యాంలను పరిశీలించారు. నవంబర్ 5న మంత్రివర్గ సమావేశంలోనూ ఈ చర్చకు తీసుకొచ్చారు. నవంబర్ 6న జరిగిన సమీక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో నీటి కొరతను ఎదుర్కోవడానికి రూపొందించిన ప్రణాళికను వివరించారు. తక్షణమే నీటి వినియోగాన్ని తగ్గించాలని.. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించాలని.. అన్నదానంలో ఆకుల విస్తర్ల వినియోగాన్ని పెంచాలని.. కాటేజీ.. పత్రాలలో కుళాయిల సంఖ్యను తగ్గించాలని సూచించారు. అంతేకాదు దీర్ఘకాలికంగా ఆకాశగంగ రిజర్వాయర్.. కళ్యాణి డ్యాం నుంచి నీటిని పంపించే పథకాలను వేగవంతం చేయాలని సూచించారు. వాస్తవానికి కళ్యాణి డ్యాం నుంచి తిరుమలకు నీటిని తరలించే ప్రతిపాదన ఇప్పటికే పరిశీలనలో ఉంది. 1999 మార్చి 29న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పథకానికి ఆరు కోట్ల ప్రాథమిక పరిపాలన అనుమతి ఇచ్చింది. అయితే ఈ పనుల వేగం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. మొదట్లో ఆరు రోజుల్లో పూర్తి చేయాలని భావించిన రెండు నెలల్లో పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రాజెక్టు సాధారణ పైపులైను నిర్మాణం కాదు. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి నీటిని పంపాల్సి ఉండగా భారీ మోటర్లు.. ప్రత్యేకమైన పంపింగ్ స్టేషన్లు.. బలమైన పైపులైన్లు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో లార్సెన్ అండ్ టు బ్రో నాయకత్వంలోని కిర్లోస్కర్ బ్రదర్స్.. ఐ వి ఆర్ సి ఎల్.. సుభాష్ ప్రాజెక్ట్స్ సంస్థలతో కూడిన కన్సర్షియానికి పనులు అప్పగించారు. ఈ పనులు వేగంగా పూర్తయ్యాయి. 2000 సంవత్సరం ఫిబ్రవరిలో ఈ పంపింగ్ స్కీం మొదలైంది. మొత్తం నాడు ప్రాజెక్టుకు 12 కోట్లు ఖర్చుపెట్టారు.
ఈ స్కీం లో అత్యంత ఆసక్తికరమైన అంశం నీటిని కొండపైకి ఎత్తి పంపే విధానం. కళ్యాణి డ్యాం నుంచి వచ్చే నీటిని శ్రీనివాస మంగాపురం సమీపంలోని పైపులైను అనుసంధాన కేంద్రం వద్దకు తీసుకొస్తారు. అక్కడి నుంచి రెండు దశలలో భారీ మోటార్ల సహాయంతో తిరుమల వైపు పంపింగ్ చేశారు. మొదటి దశలో 180 హెచ్ పీ సామర్థ్యం కలిగిన ఐదు పంపులు ఏర్పాటు చేశారు. వీటిలో మూడు పనిచేసే విధంగా.. రెండు స్టాండ్ బై మాదిరిగా ఉండేలా రూపొందించారు. ఈ పంపింగ్ స్టేషన్ సుమారు 205 మీటర్ల ఎత్తుకు సరఫరా చేస్తుంది. అక్కడి నుంచి 350 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన సుమారు 4.5 లైన్ పొడవైన ఈఎంఎస్ పైప్ ద్వారా రెండవ దశ పంపింగ్ స్టేషన్‌కు నీరు చేరుతుంది.
రెండవ దశలో 938 హెచ్ పీ సామర్థ్యం కలిగిన మూడు భారీ పంపులు ఏర్పాటు చేశారు. వీటిలో రెండు పనిచేసే విధంగా.. ఒకటి ప్రత్యామ్నాయంగా ఉండేవిధంగా రూపొందించారు. ఈ దశలో నీటిని మరో 558 మీటర్ల పంపింగ్ హెడ్ తో పైకి ఎత్తుతారు. అనంతరం 450 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన సుమారు 3.5 వరకు తిరుమలకు నీటిని తరలిస్తారు అంటే మొత్తం రెండు దశల్లో కలిపి దాదాపు 763 మీటర్ల పంపింగ్ హెడ్ ను అధిగమించి నీటిని కొండపైకి చేరవేస్తారు.
ప్రారంభ ఈ పథకం రోజుకు 10 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేసే విధంగా రూపొందించబడింది. అయితే దీనిని మొత్తం గంటకు 570 క్యూబిక్ మీటర్లుగా నిర్దేశించారు. భక్తుల సంఖ్య.. నీటి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తర్వాత పంపిన వస్తువులను పెంచే విధంగా చర్యలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2009 ఇంజనీరింగ్ నివేదిక ప్రకారం 2007లో తిరుమల రోజువారి నీటి వినియోగం 30 లక్షల గ్యాలన్లు. 2008లో అది 35 లక్షల గ్యాలన్లకు చేరుకుంది. ఆ సమయంలో కళ్యాణి పంపిణీ పథకం ద్వారా రోజుకు సుమారు 13 లక్షల గ్యాలన్ల నీరు అందుతోంది. దీనిని 20 లక్షల గ్యాలన్‌లకు పెంచడానికి అదనపు మోటార్లు.. పైపులైన్ ఏర్పాటు చేయకుండానే ఉన్న వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే ప్రతిపాదనను నాడు తిరుమల తిరుపతి దేవస్థానం పరిశీలించింది.
కళ్యాణి డ్యాం నుంచి తిరుమలకు నీటిని పంపించే వ్యవస్థ ఏర్పాటుతో తిరుమలకు మరో ముఖ్యమైన నీటి వనరు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఈ పైపులైన్ ద్వారా శ్రీవారి మెట్టు ప్రాంతంలోని బోరు బావుల నీటిని.. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తెలుగు గంగ నీటిని కూడా పంపింగ్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. 2015-17 నిర్వహణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డులలో ఈ పథకానికి సంబంధించిన రోజులు 15 నుంచి 20 లక్షల గ్యాలన్ల పంపిణీ సామర్థ్యం ఉంది. మొదటి, రెండవ దశ పంపింగ్ స్టేషన్లు.. మోటార్లు.. విద్యుత్ వ్యవస్థలు.. పైపులైన్ల నిర్వహణను నిరంతరం కొనసాగిస్తున్నారు.
తిరుమలలో 1999లో ఏర్పడిన నీటి సంక్షోభం ఒక ప్రత్యామ్నాయ నీటి వనరు ఎంత అవసరమో అనుభవంలోకి తెచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కళ్యాణి డ్యాం నుంచి నీటిని కొండపైకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. రెండు నెలల్లోనే పనులు పూర్తి లక్ష్యంగా పెట్టుకోవడం కీలక పరిణామం. నాడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తిరుమలలో భక్తులకు నీటి కరువును దూరం చేసింది.
