విశాఖపట్నం బే సిటీ: ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ.. చరిత్రాత్మకమైన కట్టడాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్ పేరు వినగానే ఐటీ కంపెనీలు.. గ్లోబల్ టెక్ సంస్థలు.. సైబరాబాద్.. హైటెక్ సిటీ గుర్తుకు వస్తున్నాయి. ఈ మార్పు వెనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. అప్పట్లో హైదరాబాద్ నగరానికి హైటెక్ సిటీని పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరానికి అనుబంధంగా మరో ఆధునిక నగరాన్ని అభివృద్ధి చేశారు […]
విశాఖపట్నం బే సిటీ: ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ.. చరిత్రాత్మకమైన కట్టడాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్ పేరు వినగానే ఐటీ కంపెనీలు.. గ్లోబల్ టెక్ సంస్థలు.. సైబరాబాద్.. హైటెక్ సిటీ గుర్తుకు వస్తున్నాయి. ఈ మార్పు వెనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. అప్పట్లో హైదరాబాద్ నగరానికి హైటెక్ సిటీని పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు విశాఖపట్నం నగరానికి అనుబంధంగా మరో ఆధునిక నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. దానికి బే టెక్ సిటీగా నామకరణం చేశారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం హైదరాబాదులో ప్రారంభమైన ఐటీ విప్లవానికి.. ఇప్పుడు విశాఖపట్నంలో ప్రతిపాదిస్తున్న బే టెక్ సిటీకి చాలా ఆసక్తికరమైన పోలిక ఉంది.
1990 దశకంలో హైదరాబాద్ ను ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేశారు. ఈ కార్యక్రమంలోనే మాదాపూర్ ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మాణం శ్రీకారం చుట్టారు. ఎల్ అండ్ టీ కంపెనీ.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటైంది. సుమారు 158 ఎకరాల్లో 150 ఖర్చుతో ఈ ప్రాజెక్టు తొలి దశలో కోట్ల భాగంగా సైబర్ టవర్స్ నిర్మాణమైంది.
1998 నవంబర్ 22న అప్పటి ప్రధానమంత్రి వాజ్ పేయి సైబర్ టవర్స్ ను నిర్మించారు. ఆ తర్వాత ఒరాకిల్.. ఐబీఎం.. మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వైపు అడుగులు వేశాయి. హైటెక్ సిటీ చుట్టూ మాదాపూర్.. గచ్చిబౌలి.. కొండాపూర్ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయి. ఐటీ ఉద్యోగులు.. రియల్ ఎస్టేట్.. హోటల్స్.. వాణిజ్య కార్యకలాపాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది.
ఇప్పుడు చంద్రబాబు దృష్టి, విశాఖపట్నం నగరం మీద పడింది. హైదరాబాద్ లో సైబరాబాద్ ను అభివృద్ధి చేసిన తరహాలోనే విశాఖపట్నం అనుబంధంగా మరో ఆధునిక నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నవంబర్ 19న విశాఖపట్నం.. అమరావతి.. తిరుపతి ఎకనామిక్ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో విశాఖపట్నం యాంకర్ ప్రాజెక్టుకు విశాఖపట్నం బే సిటీ పేరు ఖరారు చేశారు. విశాఖపట్నం కేవలం ఒక నగరంగా కాకుండా పరిశ్రమలు.. ఐటీ.. వాణిజ్యం.. పర్యాటకం.. పోర్టులు.. రవాణా వ్యవస్థలతో అనుసంధానమైన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలి అనేది ఈ ప్రణాళిక వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. సైబరాబాద్ తరహాలోనే విశాఖపట్నం నగరానికి అనుబంధంగా కొత్త ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు.
అప్పట్లో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ఐటీ రంగంలో నిలబెట్టడానికి హైటెక్ సిటీ ఒక పునాదిగా నిలిచింది. ఇప్పుడు విశాఖపట్నం నగరాన్ని బహుళ రంగాల ఆర్థిక కేంద్రంగా తీర్చి దిద్దడానికి బే సిటీ ఒక కీలక ప్రాజెక్టుగా నిలవబోతోంది. విశాఖపట్నం ఏకనామిక్ రివిజన్ పరిధిలో మొత్తం 167 ప్రాజెక్టులను పేర్కొన్నారు. ఇప్పటికే 64 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సిటీ ఎకనామిక్ రీజియన్ పథకం ద్వారా 9,180 కోట్లతో 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములను ముందుగానే గుర్తించి, ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. విశాఖ నగరానికి ఒకవైపు విజయనగరం.. మరోవైపు అనకాపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు అవసరాలకు తగిన భూమిని సిద్ధం చేయాలని సూచించారు. పారిశ్రామిక సమీపంలోని ఉద్యోగులు.. ప్రజలకు అవసరమైన గృహాలు.. విద్య.. వైద్యం.. రవాణా సౌకర్యాలు ఉండాలని సూచించారు.
హైదరాబాద్ నగరానికి సముద్ర తీరం లేదు. విశాఖ నగరానికి అత్యంత సహజమైన సముద్ర తీరం ఉంది. ప్రధానమైన పోర్ట్ ఉంది. పారిశ్రామికమైన వాతావరణం ఉన్నాయి. భోగాపురం వంటి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. అనుసంధానివిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు. పోర్టులు.. విమానాశ్రయాలు.. పారిశ్రామిక క్లస్టర్లు.. కార్పొరేట్‌ను పరస్పరం అనుసంధానించడం ద్వారా ఎగుమతులు… తీర ప్రాంతంలో పర్యాటకాన్ని కూడా డెవలప్ చేయాలని చూస్తోంది. కైలాసగిరి నుంచి భీమిలి వరకు సుమారు 25 తీర ప్రాంతంలో 40 చదరపు చదరపు విస్తీర్ణంలో బే సిటీ ప్రతిపాదన గతంలో తెరపైకి వచ్చింది. ఇందులో పర్యాటకం.. వ్యాపారం.. నివాసాల అభివృద్ధికి ప్రతిపాదన కూడా అప్పట్లో వచ్చింది.
ఒకప్పుడు హైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిన తర్వాత ఐటీ రంగం ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చాలామంది అనుకోలేదు. మాలిక సహాయ అభివృద్ధి.. పెట్టుబడులను ఆకర్షించే విధానాలు.. అంతర్జాతీయ సంస్థలకు అనుకూలమైన వాతావరణం కారణంగా హైదరాబాద్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందింది. విశాఖపట్నంలో కూడా అదే స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే అది కూడా ఐటి పరంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రపంచ ఐటీ కార్యకలాపాలకు అమెరికా సిలికాన్ వ్యాలీని కేంద్రంగా చెబుతారు. చంద్రబాబు విజన్ తో విశాఖ సిలికాన్ వ్యాలీని మించి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
