Home సినిమా ప్యారడైజ్ పై బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు: దరిద్రం వెంటపడితే అంతే! – Andhra Waves

ప్యారడైజ్ పై బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు: దరిద్రం వెంటపడితే అంతే! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


బాబుమోహన్.. ఈ పేరుకి ఉన్న చరిష్మా తెలుగు సినిమా ఉన్నంత కాలం వెలుగొందుతూనే ఉంటుంది. బాబు మోహన్ తమ సినిమాలో ఉండేలా చూడు అని ఇష్టదైవాల్ని ప్రార్ధించని హీరో లేడనే టాక్ కూడా తెలుగు ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో తరచూ వినపడుతూ ఉండేది.

అలాంటి బాబు మోహన్ తాజాగా టాలీవుడ్ మోస్ట్ యాంటెన్సివ్ చిత్రమైన ‘ది ప్యారడైజ్’ సినిమా యూనిట్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో తనకు జరిగిన చేదు అనుభవాలను, మేకర్స్ వ్యవహరించిన తీరును బహిరంగంగానే వెల్లడించి సంచలనం సృష్టించారు. ఇటీవలి కాలంలో సినిమాలని బాగా తగ్గించి, అత్యంత సెలెక్టివ్‌గా నటిస్తున్న బాబు మోహన్ ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఒక కీలకమైన మరియు మంచి రచయిత కోసం దర్శకుడు, చిత్ర యూనిట్ తనని స్వయంగా సంప్రదించారని గుర్తు చేసుకున్నారు.

తన వద్దకు వచ్చిన ఆ రోల్ కోసం స్వయంగా టెస్ట్ కూడా నిర్వహించారని, గెటప్ చాలా అద్భుతంగా వచ్చిందని ఆ సమయంలో ఎంతో అభినందించారని ఆయన చెప్పారు. షూటింగ్ ప్రారంభం కాగానే వెంటనే పిలుస్తామని, పనులు పూర్తి కాగానే కబురు పెడతామని యూనిట్ పెద్దలు నమ్మించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఆ తర్వాత చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోగా, కనీసం ఫోన్ చేసి చెప్పే మర్యాద కూడా పాటించలేదని బాబు మోహన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిలుపు వస్తుందని, షూటింగ్‌కి రమ్మంటారని ఎంతో ఆశగా ఎదురుచూసిన తనను చివరికి ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా పక్కన పెట్టేశారని ఆయన చెప్పారు.

ఇది కూడా చదవండి: టిల్ అవుతారు మావ కొత్త సినిమా: సబ్జెక్ట్ ఏంటో తెలిస్తే షాక్!

తనలాంటి అనుభవజ్ఞుడైన సీనియర్ నటుడిని ఇలా గెటప్ వేసి, లుక్ టెస్ట్ చేసి అర్ధంతరంగా పక్కన పెట్టడం తీవ్ర అవమానకరమని ఆయన మధనపడ్డారు. నటినటులకు కనీస గౌరవం ఇవ్వని వారికి దరిద్రం, శని వెంటపడతాయని, అందుకే ఆ సినిమాకి ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదని కొంచం ఘాటుగా ఉదహరించారు.

ప్రస్తుతం ఈ కాస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మీకు నచ్చవచ్చు:రామాయణ సౌత్ కలెక్షన్స్ ఇంతే!
మీకు నచ్చవచ్చు: రంగంలోకి చిరంజీవి: ఫ్యాన్స్ లో కోలాహలం!

[Babu Mohan , Nani, the Paradise, Kayadu Lohar, Mohan Babu]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird