‘ధురంధర్ 1, 2’ సినిమాలతో దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టి, నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ఆదిత్య ధర్. ఇప్పుడు ఆయన తర్వాత సినిమా ఎవరితో ఉంటుందనే దానిపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ‘రాకింగ్ స్టార్’ యశ్‌తో కలిసి ఆదిత్య ధర్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారు.
ఈ మెగా కాంబినేషన్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ గురించి ప్రచారం జరుగుతోంది. భారత చరిత్రలో గొప్ప చక్రవర్తి అయిన ‘చంద్రగుప్త మౌర్యుడి’ జీవితం ఆధారంగా ఆదిత్య ధర్ ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఇటీవలే యశ్‌ను కలిసి ఆ స్టోరీ లైన్ కూడా వినిపించారని టాక్. ఆదిత్య ధర్ మేకింగ్ విజన్‌కు, యశ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర సునామీ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గతంలో ఓ సౌత్ టాప్ స్టార్ హీరో, ఆదిత్య ధర్‌తో సినిమా చేయడానికి రెండు మూడు సార్లు గట్టిగానే ప్రయత్నించారట. కానీ అప్పట్లో ఆదిత్య ధర్ పెద్దగా ఆసక్తి చూపలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అలాంటిది ఇప్పుడు ఆదిత్య ధర్ స్వయంగా యశ్‌ను అప్రోచ్ అయినట్లు వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమై ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది అతిపెద్ద కాంబినేషన్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The post యశ్‌తో ‘ధురంధర్’ డైరెక్టర్ మెగా ప్రాజెక్ట్? iDreamPostలో మొదట కనిపించారు.
