Home సినిమా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్: వారణాసి తర్వాత జక్కన్న నెక్స్ట్ మూవీ ఇదేనా.? – Andhra Waves

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్: వారణాసి తర్వాత జక్కన్న నెక్స్ట్ మూవీ ఇదేనా.? – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్’ సినిమాలతో ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ప్రస్తుతం మహేశ్ బాబుతో ‘వారణాసి’ అనే భారీ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఏంటి? అనే చర్చ అప్పుడే మొదలైంది.

చాలాకాలంగా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెబుతున్న ‘మహాభారతం’ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ‘వారణాసి’ తర్వాత జక్కన్న తన పూర్తి దృష్టిని ఈ ఇతిహాసం మీద పెట్టబోతున్నారనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది.

ఇటీవల విడుదలైన నితేశ్ తివారీ ‘రామాయణ’ చిత్రానికి మంచి స్పందన రావడంతో భారతీయ ఇతిహాసాలపై మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. భారీ విజువల్స్, వీఎక్స్‌తో రూపొందించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కాలంలో పౌరాణిక నేపథ్యంతో పలు సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. దీనితో భారతీయ పురాణగాథలను భారీ స్థాయిలో ప్రదర్శించేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: వారణాసి మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.!

ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా వినిపిస్తోంది. ‘రామాయణ’ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మించిన నమిత్ మల్హోత్రా.. రాజమౌళి ‘మహాభారతం’ చిత్రానికి కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారట. హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించేందుకు ఆయన ముందుకు రాని సమాచారం.

మొత్తానికి ‘వారణాసి’ తర్వాత రాజమౌళి నుంచి ‘మహాభారతం’ వస్తుందనే ప్రచారం అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. అదే నిజమైతే మాత్రం కురుక్షేత్ర యుద్ధాన్ని రాజమౌళి తనదైన విజువల్ వండర్‌తో ఎలా చూపిస్తారో ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తారు అనడంలో సందేహం లేదు.

మీకు నచ్చవచ్చు:
వారణాసి స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!
బాక్సాఫీస్ ప్రభంజనం.. 8 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.!

[SS Rajamouli, Dream Project, Mahabharata Movie, Varanasi Movie, Ramayana]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird