శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠం వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర పంపిణీ చేయడం జరిగింది. హైదరాబాద్లోని తొర్రూర్ వద్ద ఉన్న ఈ విద్యాపీఠం వద్ద దసరా నవరాత్రుల సందర్భంగా నందమూరి మోహన రూప, నందమూరి శ్రీమంతుని చైర్మన్ నందమూరి మోహన కృష్ణ ఆధ్వర్యంలో విద్యాపీఠంలోని పెద్దలకు, విద్యార్థులకు తమ స్వహస్తాలతో వస్త్రాలను అందజేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విద్యాపీఠంలోని విద్యార్థులకు మన భారత దేశపు సంప్రదాయాలు, సంస్కృతి, విలువలు నేర్పిస్తూ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఈ గురుకులంలోని వారికి వస్త్రాలను అందచేశారు. ఈ సందర్భంగా నందమూరి మోహన రూప, నందమూరి శ్రీమంతుని అక్కడ ఉన్న ముత్తైదువులకు నమస్కారం చేసుకోగా వేదపండితులు వారిని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా అక్కడ విద్యాసంస్థలు ఉండే పండితులు మాట్లాడుతూ… “నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీ మహా సుణ్య వేదవేదాంగపీఠం నందు వస్త్రాలు పంపిణీ చేసిన శ్రీ నందమూరి మోహన కృష్ణ గారికి, నందమూరి మోహన రూప గారికి, నందమూరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము” అన్నారు.
[nandamuri family at veda vedanga vidya peetham, sri maha subrahmanya veda vedanga vidya peetham, nandmuri mohana krishna, nandamuri mohana roopa, nandamuri srimanthuni]
