
వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్ సూసైడ్..!
క్రికెట్ మైదానంలో బంతిని బౌండరీ దాటిస్తూ.. భారత జట్టు ఆడేందుకు కలతో అడుగులు వేస్తున్న ఓ యువ క్రీడాకారిణి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. చేతిలో బ్యాట్ పట్టుకుని మైదానంలో మెరవాల్సిన యువతి.. ఇంట్లో విగతజీవిగా కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల నందిని ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది.
నందిని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుతోపాటు క్రికెట్‌లో శిక్షణ పొందుతోంది. చిన్న వయసులోనే ఆటపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. క్రమంగా తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల అండర్-19 స్థాయి క్రికెట్‌లోనూ సత్తా చాటింది. బీసీసీఐ అండర్-19 స్థాయిలో ఎంపికైనట్లు, పీసీసీఏఐ అండర్-19 స్థాయిలోనూ ప్రాబల్యం వహించినట్లు సమాచారం. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి భారత జట్టుకు ఆడాలని కలలు కంటోంది. అయితే ఇంతలోనే ఆమె జీవితం విషాదాంతం.
శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే నందిని మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమ పేరుతో వేధింపులే కారణమా.?
అనిల్, కృష్ణ అనే ఇద్దరు యువకులు తాజాగా నందిని వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనిల్ ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురిచేసేవాడని, కృష్ణ కూడా అతడికి సహకరిస్తూ వేధించేవాడని బంధువులు చెబుతున్నారు. ఈ వేధింపుల కారణంగానే నందిని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్లో నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
న్యాయం కోసం రోడ్డెక్కిన కుటుంబ సభ్యులు.!
నందిని మృతితో తీవ్ర ఆవేదనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు వికారాబాద్‌లో ఆందోళనకు దిగారు. తమ బిడ్డను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం. నందినికి న్యాయం జరిగింది, ఆమె మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఒకవైపు.. మరలా క్రికెట్.. చిన్న వయసులోనే అండర్-19 స్థాయికి ఎదిగిన ప్రతిభ.. భారత జట్టుకు నాయకత్వం వహించాలనే ఆశయం.. ఇలా ఎన్నో కలలతో ముందుకు సాగుతున్న నందిని జీవితం 19 ఏళ్లకే ముగిసిపోవడం అందరినీ కలచివేస్తోంది. మైదానంలో పరుగులు సాధించి దేశం గర్వించేలా చేయాల్సిన ఓ యువ క్రీడాకారిణి ఇలా విగతజీవిగా మారడం విషాదకరం.

అసలు నందిని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటి? కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న వేధింపులు నిజమేనా? ఈ ఘటనలో అనిల్, కృష్ణ పాత్ర ఏంటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నందిని మృతికి గల అసలు కారణాలు పోలీసుల విచారణలో వెలుగులోకి రావాల్సి ఉంది.
మీకు నచ్చవచ్చు: తీన్మార్ మల్లన్న హత్యకు కుట్ర జరిగిందా..? డీజీపీ ఎమ్మెల్సీకి ఫిర్యాదు.!
మీకు నచ్చవచ్చు: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..మూడు రోజుల్లోనే భారీగా తగ్గిన గోల్డ్ రేటు..తులం ఎంతంటే.?
[ women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide ]
