Home సినిమా SA vs AUS: స్లిప్‌లో స్టన్నింగ్ ఎఫర్ట్.. సింగిల్ హ్యాండ్‌తో షార్ప్ క్యాచ్.. – Andhra Waves

SA vs AUS: స్లిప్‌లో స్టన్నింగ్ ఎఫర్ట్.. సింగిల్ హ్యాండ్‌తో షార్ప్ క్యాచ్.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
SA vs AUS: స్లిప్‌లో స్టన్నింగ్ ఎఫర్ట్.. సింగిల్ హ్యాండ్‌తో షార్ప్ క్యాచ్..


స్లిప్ లో క్యాచ్ లు పట్టాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఫోకస్ గా ఉండాలి.. అదే సమయంలో చాలా షార్ప్ గా ఉండాలి. లెఫ్ట్, రైట్ ఇలా బాల ఎటు వెళ్తున్నారు ఒడిసిపట్టుకోవాలి. అందుకే స్లిప్ లో ఫీల్డింగ్ అంటే ప్లేయర్స్ కు బిగ్ ఛాలెంజ్. ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాట్ రెన్షా ఇలాంటి ఒక స్టన్నింగ్ క్యాచ్ అందుకొని అందరినీ ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో షార్ప్‌తో వన్ హ్యాండ్ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెండో రోజు ఆటలో భాగంగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బోలాండ్ వేసిన డెలివరీకి సౌతాఫ్రికా వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్ బంతి బ్యాట్ అంచుకు తగిలి స్లిప్స్ వైపు వేగంగా దూసుకెళ్లింది. సాధారణంగా ఇలాంటి క్యాచ్‌లను అందుకోవడానికి ఫీల్డర్‌లకు చాలా తక్కువ సమయం ఉంటుంది. అయితే, రెన్షా ఏమాత్రం తడబడకుండా అప్రమత్తంగా స్పందించాడు. మెరుపు వేగంతో తన చేతిని చాచి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. అతడి అద్భుతమైన రిఫ్లెక్స్‌లు ఈ క్యాచ్‌లో క్లియర్‌గా కనిపించాయి.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే సోమవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 97 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. వర్షం కారణంగా ఆటకు పలుమార్లు అంతరాయంతో ఏర్పడిన రోజులో చాలా సమయం వృథా అయింది. అయినప్పటికీ, ఆస్ట్రేలియా బౌలర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 20/2 స్కోరుతో ఉన్న దక్షిణాఫ్రికా.. రెండో రోజు ఆటలోనూ వికెట్ల పతనాన్ని అడ్డుకోలేకపోయింది.

సుదీర్ఘ వర్ష విరామం తర్వాత ఆట తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే స్కాట్ బోలాండ్ దెబ్బకొట్టాడు. అతడి బౌలింగ్‌లో మార్క్వెస్ అకెర్మన్ ఆరు పరుగులకే వెనుదిరిగాడు. వికెట్ల వెనుక అలెక్స్ క్యారీ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో దక్షిణాఫ్రికా 25 పరుగులకే మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. స్టార్క్ బౌలింగ్‌లో మాథ్యూ బ్రీట్జ్కే నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. బ్యాట్ అంచుకు తగిలిన బంతిని క్యారీ అందుకోవడంతో దక్షిణాఫ్రికా 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పట్టు బిగించింది.

The post SA vs AUS: స్లిప్‌లో స్టన్నింగ్ ఎఫర్ట్.. సింగిల్ హ్యాండ్‌తో షార్ప్ క్యాచ్.. appeared first on iDreamPost.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird