Table of Contents
ఈ నగరానికి కొత్త పోరాడొచ్చినాడే…అంటూ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అనీష్. హీరో తండ్రికి సినిమా జనాలతో మంచి పరిచయాలు వుండడంతో, ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. మహా మహులంతా సినిమాకు బజ్ పెంచడానికి వీలయినంత ప్రయత్నించారు. దర్శకుడు వెంకీ కుడుమలకు ఇది నిర్మాతగా తొలి సినిమా. అనస్వర రాజన్ హీరోయిన్. థమన్ లాంటి పెద్ద టెక్నీషియన్స్ పని చేసారు. మహేష్ దర్శకుడు. అందరూ కలిసి ఈ కొత్త పోరాటం సినిమా ఏ విధంగా మలిచారు అన్నది పాయింట్.
కొత్త హీరోలకు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి అయితే రోమ్ కామ్ లు, లేదా థ్రిల్లర్లు చాలా దగ్గర దారి. అనీష్ ఈ రెండు కలిసిన జానర్ ను ఎంపిక చేసుకున్నాడు. వెంకీ కుడుమల స్పెషాలిటీ సున్నితమైన హాస్యం. దాన్ని కొంచెం మిక్స్ చేసారు. అన్నీ కలిపి తయారు చేసుకున్న కథేంటి అంటే..
దొంగ కొడుకుగా దొంగతనాలే అలవాటు అయిన కుర్రాడు అర్జున్ (అనీష్). చిన్నప్పుడే జైలుకు వెళ్లి వస్తాడు. అతగాడికి మాటలు రావు. కానీ చేతివాటం చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచి కీర్తి (అనుస్వర)ను మౌనంగా ఆరాధిస్తుంటాడు. ఇది ఓ ట్రాక్. దాదాగిరి చేసే ఓ పెద్దన్న (ముఖేష్ రుషి) కి చెందిన వెయ్యి కోట్ల బదిలీ వ్యవహారం ఓ పెన్ డ్రైవ్ లో భయంకరమైనది. అది కాస్త కనిపించకుండా పోతుంది. దాని కోసం గ్యాంగ్ వార్ లు మొదలవుతాయి. ఇందులోకి అర్జున్ ఎలా చిక్కుకున్నాడు. అసలు ఏంటి కథ, చివరకు ఏం జరిగింది అన్నది టోటల్ స్టోరీ.
అస్సలు కొత్త కథ కానే కాదు. అయితే ట్రీట్ బాగుంటే కొత్త కథ కాకపోయినా ఫరవాలేదు. పద్దతిగా పెరిగే హీరోయిన్, మాటలు రాని హీరో, వెయ్యి కోట్ల గ్యాంగ్ వార్ లు, పోలీసుల ప్రమేయం ఇవన్నీ కలిసి కథను ఓ కొత్త ప్రెజెంటేషన్ కు కావాల్సిన ప్రిపరేషన్ ను ఇచ్చాయి. కొత్త కుర్రాడు చలాకీగా నటించడంతో, ప్రారంభాన్ని మంచి థ్రిల్లింగ్ సన్నివేశాలతో ప్రారంభించి, జైసల్మీర్ లాంటి కొత్త లోకేషన్లకు తీసుకెళ్లి, ప్రేమ కథ దిశగా మళ్లించడంతో జనాలకు సినిమా మీద కాస్త ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తిని విశ్రాంతి సమయం వరకు అలాగే వుండడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అందమైన అమ్మాయి..అబ్బాయి ఫీల్ గుడ్ మూమెంట్లు, అక్కడక్కడ ఫన్, మధ్యలో థ్రిల్లింగ్ సీన్లు అన్నీ కలిసి తొలిసగాన్ని సక్సెస్ ఫుల్ గా పాస్ చేసేసాయి.
కానీ ఇక్కడ సమస్య విశ్రాంతి వేళకే కథ ఏమిటి, అందులో కన్ ఫ్లిక్ట్ ఏమిటి, పాత్రలు, వాటి వ్యవహారాలు అన్నీ తెలిసిపోతాయి. ప్రేక్షకులకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక మిగిలింది ఒక్కటే ఆ పెన్ డ్రైవ్ ఎలా తిరిగి తిరిగి ఎక్కడకు చేరిందన్న పాయింట్ ఒక్కటే. ఇప్పుడు ఈ పాయింట్ కోసం ఒక్కో సీన్ కు ముడిపెడుతూ కనీసం అరడజను సన్నివేశాలు రాసుకోవాలి. వాటి మధ్య ఫిల్లింగ్ కోసం వేరే జానర్ లోకి వెళ్లాలి. అందుకోసం హీరో, హీరోయిన్ ట్రాక్ వుండనే వుంది. కానీ తొలిసగాన్ని అంత బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు ద్వితీయార్థాన్ని అలా చేయలేకపోయాడు. దాంతో చిన్న చిన్న సిల్లీ సన్నివేశాలతో నింపుకుంటూ వెళ్లిపోయాడు. అప్పటి వరకు వచ్చిన హై కిందకు జారింది. ఇలాంటి టైం లో ఉత్కంఠ, లేదా క్లైమాక్స్ కు బదులుగా మాస్ యాక్షన్ సినిమాల మాదిరిగానే భారీ క్లైమాక్స్ ప్లాన్ చేసారు. అది ఏమంతి కట్టలేదు. దాంతో తొలిసగం ఇచ్చిన ఇంప్రెషన్ ను మలిసగం కొంత వెనక్కు లాగేసింది. లేదంటే ఏదైనా మంచి మార్కులు పడేవి.
ఇలాంటి సినిమాలో తొలిసారిగా నటించిన హీరో అనీష్ అయితే తన టార్గెట్ రీచ్ అయ్యాడు. హీరో బాగా చేసాడు. పాటలు, ఫైట్లు, డైలాగులు, ఎమోషన్లు అన్నీ బాగా పండించాడు అనే ఫీడ్ బ్యాక్ ను సంపాదించుకున్నాడు. తొలి సగంలో అనస్వర చాలా అందంగా కనిపించింది. మలిసగంతో ఆమెకు అంత అవకాశం లేదు. ఇకపై అనస్వర ను మిడ్ రేంజ్ కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గా తీసుకోవడం మీద ఆసక్తి ఇండస్ట్రీలో పెరుగుతుంది. మిగిలిన వారంతా ఓకె.
సాంకేతికంగా సినిమా చాలా బలంగా వుంది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. సినిమా చాలా లావిష్ గా కనిపించింది. థమన్ అందించిన పాటలు బాగా ఉన్నాయి. నేపథ్య సంగీతం. మీద గట్టి వర్క్ చేసాడు కూడా. సినిమా డైలాగ్ పార్ట్ చాలా బాగుంది.
మొత్తం మీద చూసుకుంటే ఓ రేంజ్ కు వెళ్లాల్సిన సినిమా సెకండాఫ్ లో కథనం, క్లైమాక్స్ కారణంగా కాస్త మిస్ ఫైర్ అయింది.
ప్లస్ పాయింట్లు
- తొలిసగం
- నిర్మాణ విలువలు
- పాటలు, నేపథ్యసంగీతం
- రైటింగ్
..
మైనస్ పాయింట్లు
- ప్రీ క్లయిమాక్స్..క్లయిమాక్స్
..
పంచ్ లైన్
హిట్టు అర్జున
