Home Latest News జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..! | జీవితంలో డబ్బు మరియు గౌరవం కావాలి | ఈ నియమాలు పాటించండి | జీవితంలో డబ్బు మరియు గౌరవం సంపాదించడానికి 7 గోల్డెన్ రూల్స్ – Andhra Waves

జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..! | జీవితంలో డబ్బు మరియు గౌరవం కావాలి | ఈ నియమాలు పాటించండి | జీవితంలో డబ్బు మరియు గౌరవం సంపాదించడానికి 7 గోల్డెన్ రూల్స్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..! | జీవితంలో డబ్బు మరియు గౌరవం కావాలి | ఈ నియమాలు పాటించండి | జీవితంలో డబ్బు మరియు గౌరవం సంపాదించడానికి 7 గోల్డెన్ రూల్స్


జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..!

మనం నిత్య జీవితంలో గమనిస్తే కొందరి దగ్గర డబ్బు బాగానే ఉంటుంది కానీ నలుగురిలో వారికి ఎలాంటి గౌరవం దక్కదు. మరికొందరి దగ్గర డబ్బు పెద్దగా లేకపోయినా ప్రతి ఒక్కరూ ఎంతో గౌరవిస్తారు. అయితే నిజ జీవితంలో ఎదుగుదలను కోరుకునే ప్రతి ఒక్కరికీ డబ్బుతో పాటు సమాజంలో మంచి పేరు, గౌరవం కూడా ఉండాలనే ఆశ ఉంటుంది. ఈ రెండు విషయాలను బాలెన్స్ చేసుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవాలో కొన్ని ముఖ్యమైన జీవన నియమాలు మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. వీటిని పాటిస్తే జీవితంలో డబ్బు, గౌరవం రెండూ లభిస్తాయి. అవేంటో వివరంగా తెలుసుకుంటే..

డబ్బు మన విలువలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం..

కేవలం అధిక లాభాలు లేదా ఎక్కువ సంపాదన కస్టమర్లకు లేదా వ్యక్తులకు అనవసరమైన వస్తువులను అంటగట్టడం, వ్యాపారంలో అబద్ధాలు చెప్పడం వంటి పనులు చేయకూడదు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించినా ఆ సంపాదన ఎక్కువ కాలం నిలబడదు, పైగా నలుగురిలో మన మీద ఉన్న నమ్మకం పోతుంది. ఎంత కష్టపడి సంపాదించినా నిజాయితీ అనే పునాది లేకపోతే ఆ డబ్బుకు ఎలాంటి విలువ ఉండదు. అందుకే ముందుగా విలువలను పెంచుకోవాలి, అలా చేస్తే ఆటోమెటిక్ గా డబ్బు కూడా వెనుక వస్తుంది.

మాటకు ఇచ్చే విలువ..

ఎవరికైనా మాట ఇచ్చామంటే అది ఎంత చిన్నదైనా తప్పకుండా నిలబెట్టుకోవాలి. చేయలేని పనులకు తొందరపడి వాగ్దానాలు చేయడం, మాట తప్పడం వల్ల మనుషుల మధ్య నమ్మకం పూర్తిగా సడలిపోతుంది. నోటి నుంచి వచ్చే మాట మన దగ్గర ఉన్న డబ్బు కంటే ఎంతో విలువైనది. తక్కువగా మాట్లాడినా పర్వాలేదు కానీ ఇచ్చిన మాట మీద నిలబడే తత్త్వాన్ని అలవాటు చేసుకుంటే సమాజంలో మనపై ఎంతో గౌరవం పెరుగుతుంది.

సంపాదించడం ఎంత ముఖ్యమో, పొదుపు చేయడం అంతకంటే ముఖ్యం..

చేతికి డబ్బు రాగానే వచ్చిన వెంటనే అనవసరమైన విలాసాలకు, ఖరీదైన వస్తువులకు ఖర్చు పెట్టడం సరైన పద్ధతి కాదు. జీవితంలో ఎప్పుడైనా అనుకోని ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆ సమయంలో మనల్ని ఆదుకునేది మనం చేసిన పొదుపే. అందుకే ఆదాయాన్ని కుటుంబ అవసరాలు, వ్యాపార పెట్టుబడులు , పొదుపుగా విభజించుకుని తెలివిగా నిర్వహించడం నేర్చుకోవాలి. డబ్బు మనకోసం పనిచేసేలా చూసుకోవాలి తప్ప మనం డబ్బుకోసం పరిగెత్తకూడదు.

ఇది కూడా చదవండి పిల్లలు తల్లిదండ్రులతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటే.. ఇదిగో ఇలా పెంచండి..!

ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించడం..

మనం ఎంత మంచివారైనా, ఎంత నిజాయితీగా ఉన్నా కొందరు విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి అనవసరమైన విమర్శల గురించి ఆలోచిస్తూ మన లక్ష్యాలను విస్మరించకూడదు. నిజమైన విమర్శ గమనించి నుంచి ఏదో నేర్చుకోవాలి, అసూయతో వచ్చే మాటలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. అందరి అప్రూవల్ కోసం కాకుండా మన విలువల పట్ల మనమే నిజాయితీగా ఉండాలి.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.. సహాయం చేసిన వారిని మరవకూడదు..

జీవితంలో కష్టకాలంలో ఉన్నప్పుడు మన వెన్నంటి నిలబడిన వారిని గుర్తుంచుకోవాలి. మనం ఆర్థికంగా స్థిరపడిన తర్వాత మన చుట్టూ ఉన్న తోటివారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి చేతనైనంత సహాయం చేయాలి. నిజమైన సంపద మన దగ్గర ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనేది కాదు, మన వల్ల ఎంతమంది జీవితాలు మారాయనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

తెలుసుకోవాల్సిన అసలు విషయం..

డబ్బు మాత్రమే ఉండి అహంకారం ఉంటే దానికి విలువ ఉండదు. అలాగే గౌరవం ఒక్కటే ఉండి జీవన ప్రమాణాలు లేకపోయినా ఇబ్బందే. ఈ రెండు సమపాళ్లలో దక్కాలంటే నైపుణ్యంతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు డబ్బు సంపాదించానని, కానీ దానికోసం నా విలువలను కోల్పోలేదని గర్వంగా చెప్పుకునేలా బతకడమే అసలైన విజయం.

*రూపశ్రీ.

మీకు నచ్చవచ్చు ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు.. కుటుంబం నిశ్చింతగా ఉండొచ్చు..!

మొహమాటం కొద్దీ అందరి ముందు తాలూపుతూ ఉంటారా.!

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird