
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత కీ కేసేమిటంటే.. పోలీసులు ఇటీవల పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ధర్నాకు సంబంధించి జగన్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పులివెందులలో మున్సిపల్ పోలింగ్ రోజున పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించడం లేదంటూ ఆరోపిస్తూ వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించినట్లు ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు జగన్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ విచారణ వై. లక్ష్మణరావు ఇరువర్గాల వాదనలను విన్న అనంతరం తదుపరి విచారణపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: జగన్ కు షాక్: అక్రమాస్తుల కేసులో రోజు వారి విచారణ, వ్యక్తిగత హాజరు: సీబీఐ కోర్టు నిర్ణయం.!
దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, అనుమతి లేకుండా ధర్నా చేపట్టడంతో పాటు సాక్షుల వాంగ్మూలాలు సేకరించామని ప్రభుత్వ పీపీ వాదించారు. అయితే ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన తరువాత, ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దని కోర్టు సూచించడం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా, ఫిర్యాదు చేసిన ఈ ఎంవో రకు నోటీసులు జారీ, కౌంటర్ ఫైల్ చేయడం పోలీసులను చేసింది.

కాగా ఏపీ మునిసిపల్, పరిషత్ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని అందుకుంది. పులివెందులలో కూడా వైసీపీకి విజయాలు పెద్దగా దక్కలేదు. పులివెందుల మునిసిపాలిటీ, జడ్పీటీసీలు తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి. జగన్ కంచుకోటలో తెలుగుదేశం జెండా ఎగరవేసింది, ఈ సమాజంలో హై కోర్టులో జగన్ కు ఊరట లభించింది.
మీకు నచ్చవచ్చు: జగన్ పిటిషన్ మళ్లీ డిస్మిస్.. ఈసారి హైకోర్టు డివిజన్ బెంచ్.!
జగన్ కంచుకోటలో కూటమి జెండా.. కడపలో వైసీపీకి భారీ షాక్.!
[Relief to Jagan in Highcourt, AP High Court Stay, Pulivendula Protest Case, Interim Orders, TeluguOne]
