Home Latest News ఒత్తిడితో ఓకే చెప్పా: ఆ తరువాత నో అన్నా.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ.! | సోనియా గాంధీ ప్రధాని తిరస్కరణ | ఎ జర్నీ ఆఫ్ లవ్ ఆటోబయోగ్రఫీ | రాజీవ్ గాంధీ హత్య | సంజయ్ గాంధీ మరణం | ఇందిరాగాంధీ | కుటుంబం | రాజకీయం – Andhra Waves

ఒత్తిడితో ఓకే చెప్పా: ఆ తరువాత నో అన్నా.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ.! | సోనియా గాంధీ ప్రధాని తిరస్కరణ | ఎ జర్నీ ఆఫ్ లవ్ ఆటోబయోగ్రఫీ | రాజీవ్ గాంధీ హత్య | సంజయ్ గాంధీ మరణం | ఇందిరాగాంధీ | కుటుంబం | రాజకీయం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ తన జీవిత విశేషాలను ప్రతిబింబిస్తూ రాసిన ఆత్మకథ బిలాంగింగ్‌: ఎ జర్నీ’ లవ్ 544 పేజీల పుస్తకంలో ఆమె తన వ్యక్తిగత జీవితం, కుటుంబ బంధాలు, రాజకీయ ప్రయాణానికి సంబంధించిన పలు అంశాలు రాసుకొచ్చారు.

ఆమె జ్ఞాపకాలలో రాజీవ్ గాంధీతో తన పరిచయం, ప్రేమ, వివాహం వంటి మధుర స్మృతులే కాకుండా, ఇటలీలో తన బాల్య జ్ఞాపకాలు, ఆ తరువాత వివాహానంతరం పూర్తిగా భిన్నమైన భారతీయ సంస్కృతికి అలవాటు పడటం, హిందీ నేర్చుకోవడం వంటి అనుభవాలనూ నెమరువేసుకున్నారు. తొలిసారి భారతీయ వంటకాలు రుచి చూడటం, చీర కట్టుకోవడం వంటి చిన్నచిన్న విషయాలు కూడా ఎంతో హృద్యంగా తన ఆత్మకథలో పొందుపరిచారు.

అలాగే తన తొలి సంతానాన్ని కోల్పోవడం గురించి కూడా ఆవేదన భారత్ రాసుకొచ్చారు. 1969 జనవరిలో నిండకముందే జన్మించిన తమ మొదటి మగబిడ్డ పుట్టిన కొద్ది గంటల్లోనే మరణించడంతో తాను, రాజీవ్ గాంధీ కుంగిపోయామనీ, ఆ కష్టకాలంలో తన అత్తగారు తనకు కొండంత అండగా నిలిచారనీ చెప్పుకొచ్చారు. ఆ పసికందును మెహ్రౌలీలోని కుటుంబ వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేసిన విషయాన్నీ.

అలాగే తన మరిది సంజయ్ గాంధీ అకాల మృతి, 1984లో ఇందిరా గాంధీ హత్య, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వంటి అంశాలు కూడా తన ఆత్మకథలో సోనియాగాంధీ విపులంగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలనుకున్నారు..సోనియా ఆత్మకథలో సంచలన విషయాలు. !

ఇక తన జీవితంలో అత్యంత విషాదఘటన 1991లో జరిగిన రాహుల్ గాంధీ హత్య, ఆయన మరణం తరువాత తన జీవితం ఎలా మారిందన్న విషయాన్నీ సోనియాగాంధీ ఆత్మకథలో నివేదించారు. ఆ పెను విషాదం తర్వాత కుటుంబ బాధ్యతలను మోస్తూనే, తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిన పరిస్థితులనూ వివరించారు.

ఇక తాను 2004లో ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడానికి కారణాలను కూడా విపులీకరించారు. ఆ ఎన్నికల ముందే తాను ఆ పదవిని చేపట్టబోనని పిల్లలకు మాటిచ్చేందుకు, కూటమి విజయం సాధించడానికి మిత్రపక్షాల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా ఒక దశలో ప్రధాని పదవి చేపట్టేందుకు ఓకే అన్నప్పటికీ, తనలోని అంతర్గత సంఘర్షణ, పార్టీ పట్ల బాధ్యత, కుటుంబం ఏ విషాదాలను బేరీజు వేసుకుని పదవిని తీసుకోకూడదన్న తన తొలి నిర్ణయానికే బేరీజు వేసుకున్నానని సోనియాగాంధీ తన ఆత్మకథలో వివరించారు.

మీకు నచ్చవచ్చు: రాజీవ్‌కు రాజకీయాలు వద్దన్న సోనియా.. రాహుల్ విషయంలో ఎందుకు మౌనం?

పౌరసత్వం రాకముందే ఓటు హక్కు పొందారా.. సోనియా గాంధీ కేసులో కొత్త ట్విస్ట్.!

[Sonia Gandhi PM Post Refusal , Belonging A Journey of LoveAutobiography, Rajiv Gandhi Assasination, Sanjay Gandhi Death, Indiragandhi, Family, Politics, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird