
వైఎస్ షర్మిల: ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మొత్తానికి కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఉన్న యలహంక ప్రాపర్టీ విషయంపై మొత్తానికి నోరు విప్పారు. తన కుమార్తె వివాహాన్ని ఇక్కడ జరపాలని ఆమె కోరింది. ఈ నేపథ్యంలోనే వివాహ ఆహ్వాన పత్రికలో వివాహ వేదిక పేరును యలహంకగా ప్రస్తావించారు. వివాహ ఆహ్వాన పత్రికలను అందరికీ పంచారు.
అయితే జరిపితే తనకి ముప్పు ఉంటుందని.. ప్రాణాలకు ప్రమాదం ఉందని జగన్ సరికొత్త భద్రత తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు తన సోదరి షర్మిలకు లేఖ ద్వారా తెలియజేశారు. జగన్ కు ఈ విషయంలో చెప్పి చూసేందుకు బంధువులు ప్రయత్నించినప్పుడు ఆయన వినిపించుకోలేదని సమాచారం. ఇదే సమయంలో షర్మిల తరఫు బంధువులు ఆమెకు అండగా నిలిచారు.
ఈ వ్యవహారం మీద తొలిసారిగా షర్మిల నోరు విప్పారు.. తనకు సంబంధించిన ఆస్తికోసం మాత్రమే పోరాడతానని.. తన అధికానికోసం ఆశపడే నీచ బుద్ధి తనకు లేదని చెప్పారు.. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ నాకు 100%.. నాకు 100% కానీ ఇప్పుడు ఆ ఆకాంక్షను నెరవేర్చలేక పోతున్నామని బాధపడుతున్నాం.. పెళ్లి వేరే ప్రదేశంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నామని” షర్మిల పేర్కొన్నారు.
షర్మిలకు.. జగన్ కు ఇక్కడి ప్యాలెస్ లో స్థలాలను విభజించారు. ఎవరివి వారి వే అన్నట్టుగా నాడు వైఎస్ బతికి ఉన్నప్పుడు నిర్మించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే షర్మిల గృహప్రవేశానికి వైయస్ విగ్రహాలు దీంతో షర్మిల తన కుమార్తె వివాహాన్ని వేరే వేదిక వద్ద నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి మేనకోడలి పెళ్లి విషయంలో మేనమామ ముందుండాలి అంటారు. కానీ ఈ విషయంలో జగన్ పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. ఫలితంగా షర్మిల తన బాధను ట్వీట్ రూపంలో బయటపెట్టారు.. షర్మిల ఆవేదనను చాలామంది అర్థం చేసుకున్నారు. జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. మేనకోడలి పెళ్లికి జగన్ సహకరించి ఉంటే బాగుండేదని షర్మిళ వర్గీయులు చెబుతున్నారు. వైఎస్ ఒకవేళ బతికి ఉంటే వివాదం కాదని, తన కుమార్తె వివాహాన్ని షర్మిళ అంగరంగ వైభవంగా జరుపుకునేవారని ఆమె శ్రేయోభిలాషులు చెబుతున్నారు.
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు.
జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం.నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని.
కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాను.వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది.
అందుకే వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం.
కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
— వైఎస్ షర్మిల (@realyssharmila) అక్టోబర్ 31, 2026
