భారతీయ రైల్వేలు: రైళ్లల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికుల మొబైల్ బ్యాటరీ అయిపోతే తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా రాత్రిపూట నడిపే వారికి ఫోన్ చార్జింగ్ చాలా అవసరం. టికెట్ వివరాలు చూసుకోవడం.. కుటుంబ సభ్యులతో మాట్లాడటం.. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఇతర ఏర్పాటు చూసుకోవడం వంటి పనులకు ఫోన్ చేయడం చాలా అవసరం. అయితే ట్రైన్ లో మొబైల్ ఛార్జింగ్ విషయంలో ఇండియన్ రైల్వే ఇప్పుడు సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది.
ఇండియన్ రైల్వే డిపార్ట్‌మెంట్ తీసుకొచ్చిన నిబంధన ప్రకారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రైళ్లల్లో మొబైల్ ఫోన్.. లాప్‌టాప్ చార్జింగ్ పాయింట్లను నిలిపివేయనుంది. ఈ నిబంధన కష్టంగా అమలు చేయడం రైల్వే శాఖ అన్ని జోన్లకు వెనకాల మరోసారి స్పష్టం చేసింది.. దీని ఒక బలమైన కారణం. ఎందుకంటే రైళ్లల్లో పవర్ పేలుడు ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తెరమీదకి తీసుకొచ్చింది.
అక్టోబర్ 26న రైల్వే బోర్డు ఒక లేఖ జారీ చేసింది. దీని ప్రకారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు చార్జింగ్ పాయింట్‌లను తప్పనిసరిగా నిలుపుదల చేయాలని అందులో స్పష్టం చేసింది. ఈ ఆరు గంటల సమయంలో ఎలాంటి నిషేధాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు అమలులో నిర్లక్ష్యం వహిస్తే రైల్వే సిబ్బందికి తగిన శిక్ష విధించాలని అధికారులు.. సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల దక్షిణ తూర్పు రైల్వే జోన్ పరిధిలో ఒక ప్రయాణికునికి సంబంధించిన పవర్ బ్యాంకు ఛార్జింగ్‌లో ఉండగా పేలిపోయింది. ఆ సమయంలో దట్టంగా పొగ వెలసింది. సిబ్బంది అలా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రైల్వే శాఖ వెల్లడించింది.
రాత్రిపూట చార్జింగ్ పాయింట్లను నిలుపుదల చేయాలి అనే నిర్ణయం ఇప్పటిది కాదు. 2013లో హాజూర్ సాహిబ్ నాందేడ్ కె ఎస్ ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ ఏసీ త్రీ టైర్ కోచ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కమిషనర్ విచారణ చేశారు. నాడు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ఏసీ కోచ్‌లలో మొబైల్ ఫోన్లు.. లాప్‌టాప్ చార్జింగ్ పాయింట్‌లను రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిపివేయాలని సూచించారు. అయితే రైల్వే బోర్డు ప్రయాణికుల భద్రత.. ఇతర సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని 2014 జూన్ నుండి రాత్రి 11 నుండి ఉదయం ఐదు గంటల వరకు చార్జింగ్ పాయింట్లను నిలుపుదల చేయాలని సూచించింది.
రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఏసీ కోచ్ లలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం సులభం. కానీ నాన్ ఎసి.. స్లీపర్ క్లాస్ కోచ్ లలో అదేవిధంగా అమలు చేయడానికి సిబ్బంది అవసరమవుతారు. 2023 నవంబర్‌లో దర్భంగా హం సఫర్ క్లోన్ స్పెషల్‌ల్లో స్లీపర్ కోచ్‌కు సంబంధించి అగ్నిప్రమాదం తర్వాత.. స్లీపర్ కోచ్‌లలో కూడా ఛార్జింగ్ పాయింట్లను నిలిపివేయాలని అధికారులు సూచించారు. అయితే నాన్ ఏసీ కోచ్‌లలో ఈ విధానాన్ని అమలు చేయడానికి సిబ్బంది ఎక్కువగా పడతారు. ఈ సందర్భంగా రైల్వే బోర్డు అందువల్ల ఏసి కోచ్లలో మాత్రమే తాజా నిర్ణయాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది.
రాత్రిపూట ప్రయాణికులు కొన్ని విషయాలను ముందుగానే గుర్తుంచుకోవాలి. రాత్రి 11 గంటలపై మొబైల్ ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ చేసుకోవాలి. అవసరమైతే పవర్ బ్యాంకు ను వెంట ఉంచుకోవాలి. మొబైల్ బ్యాటరీ లో సేవర్ మోడ్ ఆన్ చేయాలి. టికెట్ వివరాలు.. ముఖ్యమైన ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలి. పాడైన చార్జింగ్ కేబుల్ లేదా నాణ్యతలేని అడాప్టర్లను ఉపయోగించకూడదు. ఛార్జింగ్ సమయంలో ఫోన్ లేదా పవర్ బ్యాంకు వేడెక్కడం.. పొగరు రావడం అంటే లక్షణాలు కనిపిస్తే వెంటనే ఛార్జింగ్ నిలిపివేసి.. రైల్వే సిబ్బందికి సమాచారం అందించాలి.
చాలామంది ప్రయాణికులకు రైల్వే బోర్డు తాజాగా తీసుకున్న నిర్ణయం ద్వారా ఒక సందేహం వస్తోంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫోన్ చార్జింగ్ పాయింట్లను మాత్రమే నిలిపివేస్తారు. అంతేగాని మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదనేది రైల్వే శాఖ ఉద్దేశం కాదు. ప్రయాణికులు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇంటర్నెట్ ఉపయోగించవచ్చు. అయితే బ్యాటరీ పూర్తిగా నిండుకోకుండా ముందుగానే జాగ్రత్తలు వహించాలి..
ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్నబాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది. ముఖ్యంగా ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో చార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు వేడెక్కినా.. వాటిలో లోపాలు బయటపడినా.. వెంటనే గుర్తించడం కష్టం. అందుకే రైల్వే శాఖ రాత్రి పూట చార్జింగ్ పాయింట్లను నిలిపివేసే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తుంది. కాబట్టి రాత్రిపూట రైలు ప్రయాణం చేసేవారు ఈ నిబంధనలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా తెల్లవారుజామున గమన స్థానానికి చేరుకునేవారు తమ ఫోన్ బ్యాటరీ విషయంలో ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలి.
