Home ఆంధ్రప్రదేశ్ Amaravati Capital City: చంద్రబాబా మజాకా.. అమరావతికి – Andhra Waves

Amaravati Capital City: చంద్రబాబా మజాకా.. అమరావతికి – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Amaravati Capital City: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది. 2019 నుంచి 2024 వరకు అమరావతిలో తుమ్మ చెట్లు మలిచాయి. నిర్మించిన భవనాలు పడావు. ఈ నేపథ్యంలో 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు అమరావతి మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా ఆయన మార్చారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణంలో మరో కలికితురాయి చేరింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు మరో 15 వేల కోట్లు లభించాయి. […]

అమరావతి రాజధాని నగరం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది. 2019 నుంచి 2024 వరకు అమరావతిలో తుమ్మ చెట్లు మలిచాయి. నిర్మించిన భవనాలు పడావు. ఈ నేపథ్యంలో 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు అమరావతి మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా ఆయన మార్చారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణంలో మరో కలికితురాయి చేరింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు మరో 15 వేల కోట్లు లభించాయి. ఈ ప్రతిపాదనకు ఆసియా అభివృద్ధి బ్యాంక్.. ప్రపంచ బ్యాంకు సానుకూలత వ్యక్తం చేశాయి. క్యాపిటల్ సిటీ ఏరియాలో జరుగుతున్న పనుల ప్రారంభం.. ఇతర అంశాల కల్పన. లేబర్ వెల్పేర్ వంటి ఇటీవల డబ్ల్యూ బీ, ఏడీబీ ప్రతినిధులు వారంతా కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు… ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రశంసించారు.

ఈ ప్రాంతంలో ప్రస్తుతం అమరావతిలో 52 వేల 362 కోట్ల అంచనా వేయబడి 102 కీలక పనులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర శాసనసభ.. హైకోర్టు.. సచివాలయం.. హెచ్‌ఓడి టవర్లు.. వరద నివారణకు చర్యలు చేపట్టే చర్యలు ఈ పనుల ప్రణాళికను పరిశీలించేందుకు ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకుల ప్రతినిధులు గత నెలలో మూడు రోజులపాటు క్యాపిటల్ సిటీ ఏరియాలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ సిడిఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులకు అవసరమైన అదనపు నిధులపై చర్చించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు అదనంగా మరో 15 వేల రుణం కోసం ఏపీ సి ఆర్ డి ఏ ప్రతిపాదనలు సమర్పించారు. ఈ నిధులు సమకూరితే రాజధాని నిర్మాణ పనులకు మరింత ఆర్థిక తోడ్పాటు లభిస్తుంది.

అమరావతి పర్యావరణహిత.. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయడం.. ప్రస్తుత ప్రణాళికలో అత్యంత కీలకమైన అంశం. రోడ్ల నిర్మాణం. వాటర్ సప్లయి.. సినరేజ్ వాటర్ మెంటెన్స్ ఫ్లడ్ వాటర్ కంట్రోల్.. ప్రజా రవాణా.. ఇతర పనుల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు.. ఏడిబి సహకారం అందిస్తోంది. అదనపునిధుల ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఆర్థిక వనరులు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే నిర్మాణాల పూర్తికి అనుమతిపై.. త్వరలోనే అధికారికంగా ప్రకటనలు వెలువరించే అవకాశం ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird