బాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్త కన్నుమూశారు. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఆయన ఇంట్లో శవమై కనిపించారు. జాతీయ మీడియా ఎన్డీటీవీ కథనం ప్రకారం.. సంజయ్ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వంటింట్లో కిందపడ్డారు. దీంతో ఆయన తలకు బలమైన గాయం తగిలింది.
సంఘటన జరిగిన సమయంలో ఆయన భార్య, కొడుకులు ఇంట్లోనే ఉన్నారు. అయితే, సంజయ్ గాయపడ్డాడు వాళ్లు సకాలంలో గుర్తించలేకపోయారు. సంజయ్ వంటింట్లో ఎలా జారిపడ్డారు అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. పోలీసులు ఈ సంఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
సంజయ్ తన విభిన్నమైన సినిమాలతో బాలీవుడ్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని దశాబ్దాల పాటు దర్శకుడిగా కొనసాగారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్తో కలిసి ఆయన చేసిన ‘కాంటే’ , ముసాఫిర్, జిందా, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా వంటి క్రైమ్ డ్రామాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.
హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం కాబిల, ఐశ్వర్య రాయ్ నటించిన జజ్బా, జాన్ అబ్రహం-ఇమ్రాన్ హష్మీల ముంబై సాగా (2021) సినిమాలకు కూడా ఆయనే దర్శకత్వం వహించారు. ‘వైట్ ఫెదర్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై నిర్మాత పలు సినిమాలు కూడా నిర్మించారు.

