Home సినిమా ఆదర్శకుటుంబం ఫస్ట్ డే కలెక్షన్ రికార్డులు: ఎగురుతున్న వెంకీమామ జెండా! – Andhra Waves

ఆదర్శకుటుంబం ఫస్ట్ డే కలెక్షన్ రికార్డులు: ఎగురుతున్న వెంకీమామ జెండా! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


సెల్ వరల్డ్ యులాయిడ్ వద్ద ఆదర్శ కుటుంబం ప్యూర్ వెజిటేరియన్ టాక్ తో దూసుకుపోతూ ఉంది. స్టిల్ మహారాష్ట్రలోని పూణే లో పెద్ద ఎత్తున మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు,అభిమానులు మార్నింగ్ 9 .45 షో కి పెద్ద ఎత్తున చలో టూ ఆదర్శ కుటుంబం థియేటర్స్ అంటూ తరలి వెళ్తున్నారంటే ఆదర్శ హవా అర్ధం చేసుకోవచ్చు.ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆదర్శంగా కుటుంబం నమోదు చేయవచ్చనే మాటలు వినబడుతున్నాయి.

మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ వివరాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా 16.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. ఆశ్చర్యం ఎందుకని అంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది. అంచనాలు లేకపోవడానికి కూడా కారణం పలు మార్లు వాయిదా పడటం. అందుకే మంత్ ఎండింగ్ లో, అది కూడా కంప్లీట్ ఫ్యామిలీ మూవీ ఫస్ట్ డే 16 .65 కోట్లు రాబట్టడంతో ట్రేడ్ సర్కిల్స్ విస్తుపోతున్నాయి.

ఇండియా వైడ్ గా చూస్తే ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ 11.15 కోట్లు.తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలోనే అత్యధికంగా 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు కావడం విశేషం. నివేదికల ప్రకారం ఈ మొత్తం వసూళ్లలో ఇండియన్ మార్కెట్ వాటా 67 శాతం కాగా, ఓవర్సీస్ నుండి మిగిలిన 33 శాతం వసూళ్లు లభించాయి. కన్నడ ప్రాంతంలో శ్రీనిధి శెట్టి క్రేజ్ మరియు వెంకీ అభిమానుల ఆదరణతో కర్ణాటకలో 1.40 కోట్ల గ్రాస్ వచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో తమిళనాడు 30 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 18 లక్షలు, కేరళ నుండి 2 లక్షలు సాధించి మొత్తం 11.15 కోట్ల ఇండియా గ్రాస్‌ను నమోదు చేసుకుంది.

ఇది కూడా చదవండి: కిల్లర్ మూవీ రివ్యూ

విదేశాల్లో సైతం విక్టరీ వెంకటేష్ జెండా ఎగిరింది. ఓవర్సీస్ మార్కెట్లలో మొదటి రోజే రూ. 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి నార్త్ అమెరికా మరియు ఇతర దేశాల్లో సాలెడ్ ఓపెనింగ్స్ అందుకుంది. థియేటర్ల ఆక్యుపెన్సీ విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా దాదాపు 3,073 షోలలో 44.1 శాతం సగటు ఆక్యుపెన్సీ నమోదు కాగా, ప్రదర్శనల సమయాన్ని బట్టి గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఉదయం పూట 34.46 శాతం, మధ్యాహ్నం 37.15 శాతం, సాయంత్రం 46 శాతం ఉన్న ఆక్యుపెన్సీ, రాత్రి షోలకు ఏకంగా 61.69 శాతం ఎగబాకింది. హైదరాబాద్‌లోని ప్రీమియం తెలుగు EPIQ ఫార్మాట్లలో అయితే రాత్రి షోలు 100 శాతం ఆక్యుపెన్సీతో హౌస్‌ఫుల్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ తెలంగాణ 56.74 లక్షలు, ఆంధ్రప్రదేశ్. 32.90 లక్షలతో ముందంజలో నిలిచాయి. వీకెండ్ కావడంతో రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా మారింది.

[Aadarsha Kutumbam First Day Collections, Aadarsha Kutumbam collections, AK 47 Box Office Collection, Aadarsha Kutumbam Movie Review, TeluguCinema, telugu Cinema News, Tollywood, Tollywood News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird