Home ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh Politics: సంచలన సర్వే.. ఏపీలో గెలిచేది ఆ పార్టీనే – Andhra Waves

Andhra Pradesh Politics: సంచలన సర్వే.. ఏపీలో గెలిచేది ఆ పార్టీనే – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Andhra Pradesh Politics:ఆంధ్ర రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది.. జగన్ చెప్పినట్టు వైసిపి బౌన్స్ బ్యాక్ అవుతుందా.. చంద్రబాబు అంటున్నట్టుగా టిడిపి కూటమి తిరుగులేని స్థాయిని సృష్టిస్తుందా.. అనేకరకాల ఘటనలు.. గొడవలు.. కేసులు.. కోర్టుల తీర్పు తర్వాత స్థానిక ఎన్నికల్లో ప్రజలచే తీర్పు చాలా స్పష్టంగా కనిపించింది. ఆ విషయాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, […]

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు:ఆంధ్ర రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది.. జగన్ చెప్పినట్టు వైసిపి బౌన్స్ బ్యాక్ అవుతుందా.. చంద్రబాబు అంటున్నట్టుగా టిడిపి కూటమి తిరుగులేని స్థాయిని అందుకుంటుందా.. అనేకరకాల ఘటనలు.. గొడవలు.. కేసులు

ఆ విషయాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ఏకపక్షమైన విజయాన్ని సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం ఏపీలో 13 కార్పొరేషన్ల పరిధిలో 886 డివిజన్‌లో కూటమి 860 స్థానాలు గెలుచుకుందని తెలుస్తోంది. వైసిపి 22 స్థానాలకు పరిమితం అవుతుందని సమాచారం. ఇక అనంతపురం.. ఏలూరు.. విజయవాడ.. విశాఖపట్నం.. మచిలీపట్నం.. ఒంగోలు.. తిరుపతి వంటి ప్రాంతాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల వల్ల వైసీపీ పార్టీ దారుణమైన పరాభవాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని ఈ సర్వే చెబుతోంది. ఇది ఒక రకంగా ఆ పార్టీ శ్రేణులలో నిరాశను కలిగిస్తోంది. ఇది ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని చాణక్య సంస్థ తన సర్వేలో చెప్పింది. క్లుప్తంగా చెప్పాలంటే ప్రస్తుత ప్రజల కూటమికి అనుకూలంగా ఉంటుందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.

స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో రూలింగ్ చేసేది అదే పార్టీ కాబట్టి.. క్షేత్రస్థాయిలో కూడా అదే ఫలితాలు కనిపిస్తుంటాయి. కాకపోతే వన్ సైడేడ్ ఫలితాలు రావడం చాలా వరకు కష్టమైపోతుంది. కానీ ఈసారి కూటమి ఆసిద్ధాంతాన్ని సరికొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవచిస్తోంది. చేస్తున్న అభివృద్ధి.. సంక్షేమ పథకాలు.. ఇతర అంశాలు కూటమి గెలుపుకు కారణమని చెబుతున్నారు. వైసీపీ చెబుతున్నట్టుగా ప్రజావ్యతిరేకత లేదని.. ప్రజావ్యతిరేకత కేవలం వైసీపీ.. మీడియాలో మాత్రమే కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇవాల్టికి కూడా ఓటమికి సంబంధించి దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని.. కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు జగన్ వ్యక్తిత్వాన్ని తీవ్రంగా దిగజార్చుతున్నాయని.. గతంలో వైసీపీకి పనిచేసిన నాయకులకు ఇప్పుడు అధిష్టానం అంతగా సపోర్టు ఇవ్వకపోవడం కూడా ప్రజల్లో ఒక రకమైన ఆలోచనకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వైసిపికి ఒకప్పుడు సపోర్ట్ చేసిన వ్యక్తులు పాత్రికేయులు.. విజయసాయిరెడ్డి నాయకులు బయటకు వెళ్లిపోవడం.. ప్రజల్లో అనేక రకాల చర్చలకు కారణమవుతున్నాయి.

ఇలాంటి పరిణామాలను వెంటనే గుర్తించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సిన జగన్ ఆ పని చేయడం లేదు. పైగా పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను కొందరు నాయకులు నేరుగా బయటపెడుతున్నారు. విలేకరుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. స్థానిక ఎన్నికల ముందు ఇది వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బలా మారింది. ఇక చాలామంది నాయకులు అనేక రకాల కుంభకోణాలు.. అక్రమాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. చివరికి జగన్ మీద కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. అవినీతి అక్రమాల కేసులో విచారణ జరుపుతోంది. ఇవన్నీ కూడా వైసిపికి పెద్ద షరాఘతంలా మారిపోయాయి. అందుకే స్థానిక ఎన్నికల్లో వైసిపి ఎలాంటి కోలుకోలేదని తాజా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో దారుణమైన ఓటమి.. స్థానిక ఎన్నికల్లో ఘోరమైన పరాజయం.. ఈ పరిణామాలు వైసిపి రాతను మార్చుతాయా.. అధినేత దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తారా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి..



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird