
వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఆయన రాజకీయ విమర్శలు, వ్యూహాలు, ప్రెస్ మీట్లే. ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి రెడ్డి ఆ తర్వాత క్రమంగా పార్టీలో ప్రాభవం, పలుకుబడి కోల్పోయారు. దరిమిలా 2024 ఎన్నికల పరాజయం తరువాత ఆయన పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం ప్రకటించి వ్యవసాయమే తన వ్యాపకమని ప్రకటించారు. అయితే కొద్ది కాలానికే రాజకీయ సన్యాసంపై యూటర్న్ తీసుకుని సొంత పార్టీ అంటూ ప్రకటనలు గుప్పించారు. పనిలో పనిగా జగన్ పై విమర్శలూ గుప్పించారు. విజయసాయి తొలి నుంచీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ట్రెండ్ మార్చారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో సందడి చేస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రాజకీయ విషయాలకే పరిమితం కాకుండా, విభిన్న చిత్రాల రీల్స్ రూపొందించి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా తారకరత్న కుమార్తెతో కలిసి ఆయన ఇటీవల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

అయితే విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటికల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్‌లో ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే రాజకీయాల్లోకి సొంత పార్టీతో రీఎంట్రీ ఇవ్వబోతున్న విజయసాయి, ఇలా రీల్స్ లో నెట్టింట, నెటిజనులలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం అంటున్నారు.
[Vijay Sai Reddy Instagram reels, New Political Strategy, AP politics, videos, digital politics, Telugu One]
