Home ఆంధ్రప్రదేశ్ YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. – Andhra Waves

YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


YS Sunitha Reddy: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన గొంతు మూగబోయింది. నిజానికి ఆయన మరణం బలవంతంగా వచ్చింది. ఆ పెనుగులాటలో ఎంత ఇబ్బంది పడ్డారో.. ఆ నెత్తుటి కత్తులు ఆయన శరీరాన్ని చీల్చివేస్తుంటే ఎంత ఇబ్బంది పడ్డారో.. పగవాడికి కూడా ఈ నరకం రావద్దు.. ఇంతటి కష్టం వైరీవర్గాన్ని కూడా దక్కొద్దు. తండ్రి చనిపోతే.. ఆ బాధను ఆమె ఇప్పటికీ మోస్తూనే ఉంది. అవమానాలను భరిస్తూనే […]

వైఎస్ సునీతారెడ్డి: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన గొంతు మూగబోయింది. నిజానికి ఆయన మరణం బలవంతంగా వచ్చింది. ఆ పెనుగులాటలో ఎంత ఇబ్బంది పడ్డారో.. ఆ నెత్తుటి కత్తులు ఆయన శరీరాన్ని చీల్చివేస్తుంటే ఎంత ఇబ్బంది పడ్డారో.. పగవాడికి కూడా ఈ నరకం రావద్దు.. ఇంతటి కష్టం వైరీవర్గాన్ని కూడా దక్కొద్దు.

తండ్రి చనిపోతే.. ఆ బాధను ఆమె ఇప్పటికీ మోస్తూనే ఉంది. అవమానాలను భరిస్తూనే ఉంది. నా తండ్రి చనిపోయాడు.. పలానా వాడు చంపేశాడు. ఇదిగో ఆధారాలు.. వేయండి శిక్ష. నా తండ్రి ఆత్మకు శాంతి కలిగేలా చేయండి.. ఇలా ఆమె నినదించని రోజు లేదు. ఎక్కని మెట్లు లేవు. దిగని గడపలు లేవు. తన తండ్రి మరణం వెనుక ఉన్న అదృశ్య శక్తులను జైలుకు పంపించాలని ఆమె కోరుతుంటే.. ఆస్తికోసం.. అంతస్తుల కోసం.. డబ్బు కోసం ఆమె చంపిందని ఉల్టా ప్రచారం మొదలైంది. నిజానికి ఇటువంటి బాధ ఏ కన్న కూతురికి రావద్దు. పైగా కళ్ళముందు తండ్రి రక్తపు మడుగులో పడి ఉంటే.. ఆ దృశ్యాన్ని చూస్తే దురదృష్టం ఏ కుమార్తెకు లభించదు.

ఇంతటి దారుణం జరిగిన తర్వాత.. ఇంతటి ఘోరాన్ని ఆమె చూసిన తర్వాత.. దేవుడా.. ఎందుకు వేసావ్ నా తండ్రికి ఇంతటి శిక్ష.. ఎందుకు పెడుతున్నావ్ నన్ను ఇంతటి బాధ.. ఏం పాపం చేశాం.. ఏం ఇబ్బంది పెట్టాం.. నా తండ్రి చేసిన తప్పేంటి.. నా తండ్రిని చంపిన ఆమార్గ దుర్మార్గుల భరతం ఎప్పుడు పడతావ్.. ఇలా మౌనంగా ఆమె రోధిస్తూనే ఉంది. కంట కన్నీరు పెడుతూనే ఉంది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళల్లో కన్నీరు కూడా ఇంకిపోయింది.

వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత.. కొద్దిరోజుల పాటు జగన్.. సాక్షి మీడియా.. వైసిపి నాయకులు సునీతకు అండగా నిలిచారు. లేని ప్రేమను నటించారు. సాక్షిలో అయితే నారా సుర రక్త చరిత్ర అంటూ తాటికాయ పరిమాణంలో అక్షరాలు రాసి.. చంద్రబాబుని హంతకుడిగా చిత్రీకరించారు. ముందుగా వివేకానంద రెడ్డి మరణాన్ని గుండెపోటుగా భావించారు. ఆ తర్వాత సాక్షి స్క్రోలింగ్ లో కూడా అదే ప్రస్తావించారు. కానీ ఆ తర్వాత నాలుక మడత పెట్టారు. వైయస్ వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు అంటూ విష ప్రచారం మొదలుపెట్టారు.

బట్ట కలిసి వేయడంలో.. విష ప్రచారం చేయడంలో వైసిపికి ఎన్నో రికార్డులు ఉన్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి రిలయన్స్ కారణమంటూ.. రిలయన్స్ ఆస్తులపై దాడులు చేసింది జగన్ వర్గీయులు. అదే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సూచించిన వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చింది కూడా జగన్. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఇలాంటి డబుల్ స్టాండర్డ్ రాజకీయాలు జగన్ కు వెన్నతో పెట్టిన విద్య.

ఇప్పుడు సునీత రెడ్డి న్యాయం కోసం తిరుగుతోంది. సిబిఐ వివేకానంద రెడ్డి మరణం లో అసలు విషయాలు తవ్వుతున్నాయి. ఈడి ఇందులో ఉన్న మనీలాండరింగ్ వ్యవహారాలను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కేసులో ఎన్నో దారుణాలు ఉన్నాయి. మరెన్నో చీకటి నిజాలు ఉన్నాయి. కాకపోతే ఇన్ని సంవత్సరాలు గడిచాయి కూడా ఇప్పటికీ సునీత రెడ్డికి న్యాయం జరగడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత .. సునీత రెడ్డికి నమ్మకం కలుగుతోంది. తన తండ్రిని చంపిన వారికి జైలు శిక్ష పడుతుందని ఆమె అనుకుంటోంది. కానీ ఇంతటి క్రతువులో ఆమె చేస్తున్న పోరాటం భక్త ప్రహ్లాదను తలపిస్తోంది. కాకపోతే అందులో భక్త ప్రహ్లాద తండ్రి రాక్షసుడు. ఈ కథలో తండ్రి రాక్షసుల చేతిలో హత్యకు ప్రయత్నించాడు. రాక్షసులు చనిపోతే పండగ చేసుకుంటారు. రాక్షసులు మనుషులను చంపితే వాళ్ల తరఫు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. అచ్చం సునీత రెడ్డి లాగా.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird