Home సినిమా భార్యకు జాబ్.. నేను ఇంటి పని చేస్తా – Andhra Waves

భార్యకు జాబ్.. నేను ఇంటి పని చేస్తా – Andhra Waves

by andhra andhrawave
0 comments
భార్యకు జాబ్.. నేను ఇంటి పని చేస్తా


భారతీయ సమాజంలో పాతుకుపోయిన లక్షణం ఏంటంటే.. ఉద్యోగం పురుష లక్షణం. అంటే మగవాడు బయటకు వెళ్లి కుటుంబ పోషణకు అవసరమైన సంపాదించుకు రావాలి. ఆడవాళ్లు.. ఇంటి పట్టున ఉండి కుటుంబాన్ని చూసుకోవాలి. అలానే భారతీయ వివాహ వ్యవస్థలో భర్త సంపాదించడం, భార్య ఇంటి బాధ్యతలు చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నేటి కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. నేటి కాలంలో ఉద్యోగం పురుష లక్షణం అనే మాట వర్తించదు.

అయితే తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్.. తెగ వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇంతకు అతగాడు పెట్టిన పోస్ట్ ఏంటంటే.. తన భార్య ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంటే, తాను పూర్తిస్థాయి గృహస్థుడిగా (హౌస్ హస్బెండ్) తన ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటానని అతను తన మనసులో మాటను బయటపెట్టాడు.

రెడ్డిట్ వేదికగా ఆసక్తికర ప్రతిపాదన

ప్రముఖ సోషల్ మీడియా వేదిక రెడ్డిట్‌లోని ‘r/AskIndianWomen’ కమ్యూనిటీలో “కుటుంబాన్ని పోషించే భార్య కోసం చూస్తున్నాను” అనే హెడ్డింగ్ తో సదరు యువకుడు పోస్ట్ చేశాడు. తనకు, కెరీర్ లేదా వ్యాపారాన్ని ఎక్కడ నచ్చినా ఉద్యోగం కొనసాగించాలనుకునే మహిళ తనకు భార్యగా కావాలని అందులో పొందుపరిచాడు. ఆమె ఆర్థిక విషయాలు చూసుకుంటూ సంపాదిస్తే, తాను వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం సహా ఇంటి పనులన్నీ సంతోషంగా నిర్వర్తిస్తానని తెలిపాడు.

భార్యకు ఏడాదికి 12 లక్షల ఆదాయం మస్ట్

ఈ ఏర్పాటు పట్ల తాను ఎంతో నిబద్ధతతో ఉన్నానని చెప్పిన ఆ యువకుడు, పిల్లలు తమకు వద్దని చెప్పారు. పరస్పర ప్రేమ, గౌరవం, సమానత్వంతో కూడిన దాంపత్య జీవితాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు ఆశిస్తున్నట్లు ఉన్నాయి. ఆ తర్వాత తన పోస్ట్‌కు మరిన్ని వివరాలను జతచేస్తూ.. తన ఎత్తు ఆరడుగులు అని, మంచి శరీర సౌష్టవం, రంగు కలిగి ఉంటానని తెలిపాడు. ఇంకా, తన తల్లిదండ్రులు ఏ-క్లాస్ ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందారని, వారికి పెన్షన్ వస్తుందని వివరించారు. అయితే, తనకు కాబోయే భార్యకు కనీసం ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఉండాలని అతను షరతు విధించాడు.

నెటిజన్ల భిన్న స్పందనలు

ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. మహిళలు ఇంటి బాధ్యతగా స్వీకరించడానికి ఓ పురుషుడు బహిరంగంగా ముందుకు రావడం మంచి పరిణామమని కొందరు ప్రశంసించారు.

మరికొందరు మాత్రం వివాహనంతరం ఎదురయ్యే వాస్తవ పరిస్థితులు, సర్దుబాట్లపై ప్రశ్నలు సంధించారు. “పెళ్లి తర్వాత ఆమె మీరు తన జీవితాన్ని మార్చుకోకుండా, తన ఇంటి వద్దే ఉండాలని కోరితే.. ఆమె సంపాదించే పరిమిత వనరులతోనే ఇంటిని నడపగలరా? పెళ్లి తర్వాత అన్ని నిర్ణయాలు తీసుకుంటే అంగీకరిస్తారా.. ఆమె ఇంటిపేరును మీరు స్వీకరిస్తారా.. పెళ్లి ఖర్చులలో ఏమైనా ఆర్థిక బాధ్యత తీసుకుంటారా..” అంటూ ఓ నెటిజన్ సూటిగా ప్రశ్నించారు.

మరో యూజర్ తన సొంత అనుభవాన్ని పంచుకుంటూ, మరొకరు ఉద్యోగం చేయకపోయినా ఇంటి పనులు ఎల్లప్పుడూ సమానంగా పంచబడవని అభిప్రాయపడ్డారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తాను మూడు నెలల పాటు ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు, పనిమనిషిని మాన్పించి ఇంటి పనులన్నీ తానే చేసుకున్నానని గుర్తుచేసుకున్నారు. అయితే, తాను ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాననే కారణంతో తన భర్త అంతకుముందు చేసే కొద్దిపాటి పనులను కూడా మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంమీద, హౌస్ హస్బెండ్ అనే కాన్సెప్ట్ మీద ఈ పోస్ట్ సరికొత్త చర్చకు దారి తీసింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird