ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొన్నటి వరకు మాడు పగిలే ఎండలతో జనాలు నెలలోనే మే నెల నాటి వేడితో అల్లాడారు. ఇంత వేడి మధ్య.. కాస్త ఉపశమనం కలిగించేలా తుఫాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు భారీ వర్షాలు కురిశాయి. ఇక ఏపీలో అయితే తీర ప్రాంత జిల్లాలు వాన దెబ్బకు అతలాకుతలం అయ్యాయి. ఆ తుఫాను ప్రభావం నుంచి తేరుకునేలోపే.. మరో తుఫాను దూసుకువచ్చింది. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. రెండు తుఫానులు తీరం దాటడంతో కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న జనాల నెత్తిన మరో పిడుగు పడేందుకు రెడీగా ఉంది. మరో తుఫాను దూసుకొస్తుంది. అక్వాన్ తుఫాన్ దూసుకొస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు పెను తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి తుఫానుగా మారిందని, ప్రస్తుతం ఇది గంటకు 10 వేగంతో తీరం వైపు కదులుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రాంతం. ఈ తుఫాను ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీలు (గురు, శుక్రవారాలు) రెండు రోజులు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నెల్లూరు – తుని మధ్య తీరం దాటే అవకాశం
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ తుఫాను మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ గురువారం ఉదయానికి ‘అతి తీవ్ర తుఫాను’గా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి నెల్లూరు నుంచి తుని మధ్యలో ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 వేగంతో, గరిష్ఠ 145 వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపై ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
కోస్తాంధ్రలో కుండపోత వర్షాల హెచ్చరిక
తుఫాను గమనం కారణంగా బుధవారం నుంచే కోస్తాంధ్ర వ్యాప్తంగా వర్షాలు మొదలై, గురు, శుక్రవారాల్లో కుండపోతగా కురిసే సూచనలు ఉన్నాయి. ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నందున తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
