
అమెరికాను వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. ఈ సాంకేతిక వైఫల్యాల కారణంగా తలెత్తిన సంక్షోభాలే కావడం విశేషం. గత వారం రూటర్ వైఫల్యం కారణంగా ఒక విమాన సర్వీసులు అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. వైలాది విమానాలు రద్దై ప్రయాణీకులు నానా అగచాట్లూ పడ్డారు. ఆ విమాన ప్రయాణాల సంక్షోభం ప్రభావం ఇంకా పూర్తిగా ముగియకముందే, ఇప్పుడు దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలు సాంకేతిక లోపాల కారణంగా కుదేలయ్యాయి.
అమెరికాలోని దిగ్గజ ఆర్థిక సంస్థలైన జెపి మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో వంటి బ్యాంకుల సేవలు సోమవారం (నవంబర్ 16) ఒక్కసారిగా స్తంభించిపోయాయి. లక్షలాది మంది ఖాతాదారులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తమ ఖాతాల్లోని బ్యాలెన్స్‌లను తనిఖీ చేయడం, నగదు బదిలీ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ పోర్టల్లలో లాగిన్ కావడానికి ప్రయత్నించిన మిలియన్ల మంది వినియోగదారులకు ఎర్రర్ మెసేజ్‌లు దర్శనమిచ్చాయి.
ఈ పరిణామంతో జెపి మోర్గాన్ చేజ్ తక్షణమే స్పందించి హార్డ్‌వేర్ సిస్టమ్‌లలో తలెత్తిన తాత్కాలిక సాఫ్ట్వేర్ బగ్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేసింది. ఖాతాదారులు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దనీ, వారి సొమ్ము సురక్షితంగా ఉందనీ. ఈ టెక్నికల్ షట్ డౌన్ వెనుక సైబర్ దాడి భద్రతా ఉల్లంఘన ఉనికి ఏవీ లేవని స్పస్టం చేసింది. త్వరగా నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడానికి సమస్య పరిష్కరిస్తుంది,

అమెరికాలో ఒకదాని తర్వాత ఒకటిగా సాంకేతిక లోపంతో వ్యవస్థల పట్ల విధ్వంసం పట్ల సామాన్యులే కాదు, నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో డిజిటల్ సౌకర్యాల భద్రత మరియు నిర్వహణ తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: అమెరికాలో స్తంభించిన విమానం: మూడో రోజు వేలాది విమానాలు రద్దు.!
నిరంతరం టెక్నాలజీపై ఆధారపడే ఇటువంటి వ్యవస్థలు ఇలా అకస్మాత్తుగా కుప్పకూలడం ఆర్థిక మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన విమాన ప్రయాణాల అస్తవ్యస్తత పరిస్థితుల నుంచి కోలుకుంటున్న తరుణంలోనే ఈ బ్యాంకింగ్ అంతరాయం తలెత్తడం అమెరికా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది.

డిజిటల్ సేవలు అత్యంత కీలకమైన ప్రస్తుత తరుణంలో, భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక లోపాలు పునరావృతం కాకుండా టెక్ దిగ్గజాలు, బ్యాంకింగ్ సంస్థలు మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుస సంక్షోభాల నేపథ్యంలో అమెరికా ఏ విధమైన చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.
మీకు నచ్చవచ్చు: స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు: ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల గగ్గోలు.!
వాలంటరీ ఎగ్జిట్: ఉద్యోగుల తొలగింపునకు మైక్రో సాఫ్ట్ ఆఫర్ సరికొత్త వ్యూహం.!
[USbankingcrisis, USflightchaos, JPMorganChase outage, softwarebug, TeluguOne]
