ఈలోకంలో బతకడానికి గొప్ప గొప్ప చదువులు, పెద్ద ఉద్యోగాలు అవసరం లేదు. కాస్త భిన్నంగా ఆలోచించి.. కష్టపడి పని చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు అని ఎందరో నిరూపించారు. తాజాగా ఈ కోవలోకి మరో చిరు వ్యాపారి చేరాడు. మ్యాగీ అమ్ముతూ రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. అది కూడా మంచు కొండల్లో. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలు..
హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్తాంగ్ పాస్ వద్ద ఓ చిన్న వ్యాపారి పర్యాటకులకు టీ, మ్యాగీ విక్రయిస్తూ ఆఫ్-సీజన్లోనూ రోజుకు దాదాపు రూ.15,000 వ్యాపారం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక కంటెంట్ క్రియేటర్ పంచుకున్న ఈ విశేషాలు నెటిజన్లలో ఆసక్తితో పాటు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
రోజు ఎంత ఆదాయంంటే
హిమపాతం కురిసే పర్వత పర్యాటకులకు వేడివేడిగా లభించే మ్యాగీ, టీలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్నే అతడు వ్యాపారంగా మార్చుకున్నాడు. వ్యాపారి వెల్లడించిన వివరాల ప్రకారం, పర్యాటకుల రాక తక్కువగా ఉండే ఆఫ్-సీజన్లోనూ రోజుకు 60 నుంచి 70 ప్లేట్ల మ్యాగీ (ప్లేటు రూ.100), దాదాపు 200 కప్పుల టీ (కప్పు రూ.40) అమ్ముడవుతాయి. దీంతో ఆయన రోజువారీ టర్నోవర్ రూ.14,000 నుంచి రూ.15,000 వరకు ఉంటోంది. టూరిస్ట్ సీజన్ పీక్‌లో ఉన్నప్పుడు ఈ ఆదాయం మరింత రెట్టింపు స్థాయికి చేరుకుంటుందని కంటెంట్ క్రియేటర్ సూచించింది.
నేటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఈ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు విభిన్నంగా కనిపిస్తున్నారు.
ఉద్యోగాల కంటే వ్యాపారమే మేలు: ఆఫర్ ఆఫీసుల్లో రోజంతా కష్టపడి పనిచేసే ఉద్యోగాలు, ఇలాంటి స్వయం ఉపాధి లేదా వీధి వ్యాపారాలే ఎక్కువ రాబడిని ఇస్తాయని కొందరు కామెంట్ చేశారు.
ఖర్చులు, సవాళ్లు తక్కువేమీ కావు: మరోవైపు, కొందరు నెటిజన్లు వ్యాపారంలోని కష్టాలను ఎత్తిచూపారు. మైనస్ డిగ్రీ చలిలో వ్యాపారం చేయడం అంత సులభం కాదు. పైగా కొండ ప్రాంతాలకు ముడిసరుకులు, గ్యాస్ సిలిండర్లు, ఇతర సామాగ్రిని తరలించడానికి రవాణా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయని, ఇవన్నీ పోనూ అసలు కుటుంబ పోషణకు సరిపోతుందని తేలింది.
ప్రతికూల వాతావరణంలోనూ కష్టపడుతూ జీవనం సాగిస్తున్న ఆ వ్యాపారి శ్రమను మెచ్చుకుంటూనే, టర్నోవర్‌కు, నిజమైన లాభానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The post మ్యాగీ అమ్ముతూ రోజుకు 15 వేలు appeared first on iDreamPost.
