Home సినిమా అడవుల్లో పాతిపెట్టిన 170 కోట్లు – iDreamPost – Andhra Waves

అడవుల్లో పాతిపెట్టిన 170 కోట్లు – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
అడవుల్లో పాతిపెట్టిన 170 కోట్లు - iDreamPost


అన్యాయంగా, అక్రమంగా సంపాదించిన సొమ్మును దాచడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తారు. నేల లోపల, రహస్య గోడల్లో, డ్రమ్ములో పెట్టి పాతిపెడతారు. కానీ ఓ చోట మాత్రం ఏకంగా భూమిలో పాతి పెట్టారు. తవ్వుతున్న కొద్ది అవినీతి సొమ్ము బయటకు వస్తూనే ఉంది. సుమారు 170 కోట్ల అవినీతి సొమ్ముని అడవుల్లో పాతిపెట్టిన వైనం హాట్ టాపిక్‌గా మారింది.

హంగేరీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. అడవుల్లో భూమిని తవ్వి పాతిపెట్టిన నోట్ల కట్టలు, వ్యవసాయ గోదాములు, ఖరీదైన సేఫ్‌లలో దాచి ఉంచిన భారీ నగదు నిల్వలను అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో మొత్తం 19.5 మిలియన్ డాలర్లు—అంటే భారత కరెన్సీలో సుమారు రూ.170 కోట్లకు పైగా విలువైన నగదు పట్టుబడటం హంగేరీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

పాత బస్సుల కొనుగోలు స్కాంలో మాజీ మంత్రిపై గురి

హంగేరీ మాజీ ప్రధాని విక్టర్ ఓర్బన్ కేబినెట్‌లో 2014 నుంచి 2018 వరకు జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన మిలోస్ సెస్టాక్ చుట్టూ ఈ అవినీతి విచారణ తిరుగుతోంది. ప్రభుత్వ రవాణా సంస్థ పాత బస్సులను అధిక ధరలకు కొనుగోలు చేసిన అక్రమ ఒప్పందంలో ఆయన భారీగా లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ అసెట్ రికవరీ అండ్ ప్రొటెక్షన్ ఆఫీస్ (NVVH) అధికారులు గురువారం, శుక్రవారం రాజధాని బుడాపెస్ట్‌తో పాటు మరో మూడు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అడవుల్లో రాత్రివేళ పారలతో భూమిని తవ్వగా నోట్ల కట్టలు బయటపడటం అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది.

లెక్కించడానికి 12 మంది ఉద్యోగులు, 8 గంటల శ్రమ

రెండు రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో హంగేరియన్ ఫోరింట్లు, యూరోలు, అమెరికన్ డాలర్ల రూపంలో ఉన్న నోట్ల కట్టలు భారీగా లభ్యమయ్యాయి. పట్టుబడిన నగదు పరిమాణం చాలా ఎక్కువగా ఉండటంతో దాన్ని లెక్కించడం ఖజానా శాఖకు పెద్ద సవాలుగా మారింది. 12 మంది ఉద్యోగులు 5 నగదు లెక్కింపు యంత్రాల సాయంతో ఏకధాటిగా 8 గంటల పాటు శ్రమించి మొత్తం సొమ్మును లెక్కించారు. అనంతరం ఆ నగదును ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు. అడవిలో తవ్వకాలు జరుపుతున్న, కట్టలను చూసిన దృశ్యాలను అవినీతి నిరోధక విడుదల చేయడంతో అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఆరోపణలను ఖండించిన మాజీ మంత్రి

అయితే, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను మిక్లోస్ సెస్టాక్ పూర్తిగా తోసిపుచ్చారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది గాబోర్ పాప్ చెప్పారు. మరోవైపు, ఓర్బన్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన మరో ఇద్దరు నేతలతో పాటు ఆయన సోదరుడు కూడా విచారణలో ఉన్నారు.

‘ఆపరేషన్ పర్గేటరీ’తో అవినీతిపై ఉక్కుపాదం

2010 నుంచి 2026 వరకు 16 ఏళ్ల పాటు హంగేరీ ప్రధానిగా కొనసాగిన విక్టర్ ఓర్బన్ పాలనపై బంధుప్రీతి, ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో పీటర్ మాగ్యార్‌కు వ్యతిరేకంగా టిస్జా పార్టీ విజయం సాధించడంతో ఓర్బన్ సుదీర్ఘ పాలన తెరపడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన ప్రధాని పీటర్ మాగ్యార్ గత ప్రభుత్వ అక్రమాలపై ‘ఆపరేషన్ పర్గేటరీ’ పేరుతో ప్రత్యేక విచారణకు.

తాజాగా బయటపడిన ఈ రూ.170 కోట్ల నగదు వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు సంస్థలు లోతుగా విచారిస్తున్నాయి.బడి లెక్కించాల్సిన నోట్ల కట్టలు. హంగేరీలో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ డబ్బు ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird