Home సినిమా చర్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం – iDreamPost – Andhra Waves

చర్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
చర్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం - iDreamPost


హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెయింటెనెన్స్ పనుల కోసం ప్లాట్‌ఫామ్ నంబర్ 5, 6 మధ్య నిలిపి ఉంచిన ఖాళీ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు ఇతర బోగీలకు వ్యాపించడంతో స్టేషన్ పరిసరాల్లో కలకలం రేగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. సాయంత్రం 6.30 గంటల సమయంలో రైలులో మంటలు మొదలయ్యాయి. ప్లాట్‌ఫామ్ 5, 6 మధ్య మెయింటెనెన్స్ కోసం నిలిపిన ఖాళీ రైలు చివరి బోగీలో మొదటి మంటలు కనిపించాయి. ఆ తర్వాత అవి పక్కనున్న బోగీలకు వ్యాపించాయి. కొన్ని బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. ఏడు బోగీల వరకు మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది.

అప్రమత్తమైన రైల్వే సిబ్బంది

బోగీల నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రైల్వే పోలీసులతో పాటు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రైల్వే అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. మంటలు ఇతర రైళ్లకు వ్యాపించకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అగ్నికి గురైన బోగీలను మిగిలిన బోగీల నుంచి వేరు చేశారు.

అదుపులోకి వచ్చిన మంటలు

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం 6.35 గంటలకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందినట్లు దక్షిణ మధ్య రైల్వే. దాదాపు 7.15 గంటల వరకు మంటలను ఆర్పే చర్యలు కొనసాగుతున్నాయి. చివరకు మంటలను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే, అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ప్రమాదానికి కారణం ఏంటి?

ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ప్రాణనష్టం కూడా జరగలేదని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. రైలు ఖాళీగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే అసలు మంటలు ఎలా చెలరేగాయన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird