Home ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ వివాహ బంధానికి పవన్, అన్నా లెజ్ నోవా స్వస్తి – Andhra Waves

పవన్ కళ్యాణ్ వివాహ బంధానికి పవన్, అన్నా లెజ్ నోవా స్వస్తి – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


పవన్ కళ్యాణ్:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయన భార్య అన్నా లెజ్ నోవా స్వస్తి పలికారు. పరస్పర అంగీకారంతో ఇద్దరు విడిపోయారు. సంయుక్త ప్రకటన ద్వారా తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు వివరించారు. దాదాపు 12 సంవత్సరాల జీవితాన్ని పంచుకున్న వారు.. తన ప్రయాణాన్ని పరస్పర అవగాహనతో కొనసాగించారు. ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వైవాహిక బంధం నిర్వహించినప్పటికీ.. పిల్లల పెంపకం విషయంలో మాత్రం బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా కొనసాగుతామని […]

పవన్ కళ్యాణ్:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయన భార్య అన్న లెజ్ నోవా స్వస్తి పలికారు. పరస్పర అంగీకారంతో ఇద్దరు విడిపోయారు. సంయుక్త ప్రకటన ద్వారా తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు వివరించారు. దాదాపు 12 సంవత్సరాల జీవితాన్ని పంచుకున్న వారు.. తన ప్రయాణాన్ని పరస్పర అవగాహనతో కొనసాగించారు. ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

వైవాహిక బంధం నిర్వహించినప్పటికీ.. పిల్లల పెంపకం విషయంలో బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా కొనసాగుతామని చెప్పారు. తమ పిల్లల సంతోషం.. శ్రేయస్సు.. సంక్షేమం విషయంలో మొదటి ప్రాధాన్యతని.. వారికోసం ఎప్పటికీ మంచి స్నేహితులుగా మిగిలిపోతామని పవన్, అన్న వివరించారు. వ్యక్తిగత జీవితంలో మార్పులు సహజమని.. ఇప్పుడు జరుగుతున్న ఈ మార్పుల విషయంలో మీడియా.. అభిమానులు.. శ్రేయోభిలాషులు తమ వ్యక్తిగత జీవితానికి గౌరవం కల్పించాలని. ఇప్పటివరకు మా ప్రయాణంలో అండగా నిలిచిన వారికి.. ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సంయుక్తంగా వారిద్దరు ఈ ప్రకటన చేశారు.

పవన్ కళ్యాణ్ అన్న దంపతులకు కుమారుడు… కుమార్తె. తీన్మార్ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్త వివాహానికి దారి తీసింది. ఇప్పటికే పవన్ రేణు దేశాయ్ తో వైవాహిక బంధం లో ఉన్నారు. ఆమెకు ఒక కుమారుడు.. కుమార్తె.. రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన తర్వాత అన్నను వివాహం చేసుకున్నారు… ఆ తర్వాత ఆమెతో ఇప్పటిదాకా వైవాహిక జీవితాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగించారు.. ఇటీవల పవన్ డిప్యూటీ సీఎం అయిన అన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెగా కుటుంబంలో జరిగే ప్రతి వేడుకలో ఆమె ఉంటుంది. ఇటీవల సాయి ధరంతేజ్ ఎంగేజ్మెంట్ లో పవన్, అన్నా లెజ్ నోవా కనిపించలేదు. అకస్మాత్తుగా ఈ విడాకుల వ్యవహారం తెరమీదకి రావడంతో జనసేన నాయకులు. . పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.పవన్, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఇదంతా ఎందుకు జరిగింది. ఏది ఏమైనప్పటికీ పవన్ తీసుకున్న నిర్ణయాన్ని వారు ఆమోదిస్తున్నారు. అది ఆయన వ్యక్తిగత జీవితం అని.. వ్యక్తిగత జీవితం ఇతరులు మాట్లాడాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే కాలం గడిస్తే వారిద్దరి విడాకుల వెనుక ఏం జరిగిందనేది తెలుస్తుందని విశ్లేషకులు ఈ సందర్భంగా చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird