Home ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ , అన్నా లెజ్ నోవా నిర్ణయం.. – Andhra Waves

పవన్ కళ్యాణ్ , అన్నా లెజ్ నోవా నిర్ణయం.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


పవన్ కళ్యాణ్: ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ఆయన భార్య అన్నా లెజ్ నోవా విడిపోయారు. సోమవారం రాత్రి ఈ ప్రకటన బయటికి వచ్చింది. ఈ ప్రకటన నిజమేనా.. లేదా ఎవరైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం కోసం ఇలాంటి పనిచేశారా అని మీడియా సంస్థల్లో పని చేస్తున్న వారు అనుమానం వ్యక్తం చేశారు. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు […]

పవన్ కళ్యాణ్: ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ఆయన భార్య అన్నా లెజ్ నోవా విడిపోయారు. సోమవారం రాత్రి ఈ ప్రకటన బయటికి వచ్చింది. ఈ ప్రకటన నిజమేనా.. లేదా ఎవరైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం కోసం ఇలాంటి పనిచేశారా అని మీడియా సంస్థల్లో పని చేస్తున్న వారు అనుమానం వ్యక్తం చేశారు. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు అనే వార్తను పబ్లిష్ చేశారు. పవన్ కళ్యాణ్, అన్న లెజ్ నోవా తీసుకున్న ఈ వేదనాభరిత నిర్ణయం జనసేన కార్యకర్తలను.. పవన్ కళ్యాణ్ అభిమానులను ఆవేదనకు గురిచేస్తుంది. నిజానికి జీవితం అనేది ఎవరికి పూలబాట కాదు. ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ఉండే వారికి.. కెమెరాల కాంతిలో నడిచే నాయకుడికి వ్యక్తిగత జీవితం అంత సులభంగా ఉండదు.

పవన్ తీసుకున్న నిర్ణయం కోట్లాదిమంది అభిమానులను.. శ్రేయోభిలాషులను కలతకు గురిచేసింది. జీవితంలో ప్రతి మనిషికి కొన్ని అధ్యాయాలు అత్యంత ముఖ్యమైనవి. ఆ బంధాలు అత్యంత లోతైనవి. వాటికి దూరం జరుగుతున్నప్పుడు అనుభవించిన మానసిక సంఘర్షణ మాటలకు అందనిది. అటువంటి నిర్ణయం తీసుకునే సమయంలో దాని వెనుక ఉన్న కారణాలు ఆ ఇద్దరికి మాత్రమే తెలిసిపోతాయి. వాస్తవాలు కూడా వారిద్దరికి మాత్రమే అర్థం అవుతాయి. రాజకీయంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా ఈ ప్రభావాలు పవన్ మీద తీవ్రంగా ఉంటాయి. వాటిని అంచనా వేసి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటే.. ఆ ఆలోచన ఎంత లోతుగా ఉంటుంది.. ఆ పరిణతి ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. చుట్టూ ఉన్న సున్నితమైన పరిస్థితులు లేకుండా.. ఊహాగానాలకు అవకాశం లేకుండా.. మరొకరు దీని మీద మాట్లాడే అవకాశం.. పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సమయంలో పవన్ తీసుకున్న నిర్ణయానికి గౌరవం ఇవ్వాలి. సమాజంలో ఉన్న వ్యక్తులు దానిని అంగీకరించాలి. ప్రాథమిక సంస్కారం కూడా.

ప్రజా జీవితంలో పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కష్టాలు చవిచూశారు. అయితే వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ సంక్షోభం ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. కలతకు గురిచేస్తుంది. రాయడానికి ఇబ్బందిగా కనిపించకుండా కన్నీటిని కూడా వచ్చేలా చేస్తుంది. అయితే ఈ సంక్షోభాన్ని ఆయన దాటగలుగుతున్నారని.. ఈ గాయాలను ఆయన మాన్పుకోగలుగుతున్నారని.. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని.. ఆయనకు దివ్య ఔషధం లాగా పనిచేస్తుందని.. ప్రతికూల పరిస్థితులను ఆయన అధిగమించగలరని.. మళ్లీ ప్రశాంతమైన జీవితం వైపు అడుగులు వేస్తారని పవన్ అభిమానులు భావిస్తున్నారు.

వైవాహిక జీవితానికి మాత్రమే పవన్ ముగింపు పలికారని.. తన మాజీ భార్యతో ఆయన స్నేహంగానే ఉంటానని చెప్పారని.. పిల్లల పెంపకం విషయంలో.. వారికి ఉన్నతమైన జీవితాన్ని అందించే విషయంలో ఏమాత్రం రాజీపడబోరని అర్థమవుతుంది. రేణు దేశాయ్ ద్వారా కలిగిన ఇద్దరు పిల్లల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే ధోరణిలో ఉన్నారు. ఆద్య స్కూల్ వేడుక సమయంలో తండ్రిగా తన బాధ్యతను పవన్ నిర్వర్తించారు. ఇప్పుడు అన్న ద్వారా కలిగిన పిల్లల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అదే ఉదారత.. అదే ప్రేమను.. అదే వాత్సల్యాన్ని చూపిస్తారని పవన్ అభిమానులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ కష్ట సమయంలో పవన్ ధైర్యంగా ఉండాలని.. మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird