దీపావళి సందర్భంగా థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాలు త్వరలో ఓటీటీలోకి రాబోతున్నాయి. స్టార్ హీరో సూర్య నటించిన ‘సీన్’, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘మహాశక్తి’, సీనియర్ నటి జయసుధ కీలక పాత్రల్లో నటించిన ‘సమ్మర్ హాలీడేస్’ సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఈ మూడు సినిమాలు నవంబర్ 6న థియేటర్లలో విడుదలయ్యాయి. మరి వీటిలో ఏ సినిమా ఏ ఓటీటీలోకి రానుంది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందా? తెలుసుకుందాం.
1. సూర్య ‘సీన్’
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘సీన్’. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో సూర్య పోలీస్ అధికారి ఇంబరాజ్ పాత్రలో కనిపిస్తారు. నేరస్థులకు సింహస్వప్నంగా ఉంటే పోలీస్ ఆఫీసర్ చుట్టూ కథ సాగుతుంది. యాక్షన్, క్రైమ్, కామెడీ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఓటిటి: నెట్‌ఫ్లిక్స్
ఓటిటి రిలీజ్: డిసెంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం.
2. నయనతార ‘మహాశక్తి’
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో ఆసక్తికరమైన సినిమా ‘మహాశక్తి’. తమిళంలో ‘మూకుత్తి అమ్మన్ 2’గా రూపొందించిన ఈ సినిమాకు తెలుగులో మహాశక్తి అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ, డివోషనల్ నేపథ్యంలో సాగుతుంది. శక్తి అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నయనతార కనిపిస్తారు. ఆమె జీవితంలో చోటుచేసుకునే కొన్ని వింత పరిణామాలు, భైరా అనే దుష్టశక్తి చుట్టూ కథ సాగుతుంది.
ఓటిటి: జియోహాట్‌స్టార్
ఓటిటి విడుదల: డిసెంబర్ చివరి వారంలో.
3. జయసుధ ‘సమ్మర్ హాలీడేస్’
సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించిన తెలుగు సినిమా ‘సమ్మర్ హాలీడేస్’. ఓ నగరంలో పెరిగిన బాలుడు వేసవి సెలవుల కోసం గోదావరి తన అమ్మమ్మ ఇంటికి వెళ్తాడు. అక్కడ అతడికి ఓ స్నేహితుడు పరిచయమవుతాడు. వీరిద్దరి మధ్య ఏర్పడే స్నేహం, పల్లెటూరి వాతావరణంలో జరిగే సంఘటనలతో కథ సాగుతుంది. పిల్లలు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఒటిటి: సోనీ లివ్
అంచనా విడుదల: డిసెంబర్ మూడో లేదా చివరి వారంలో.
మరిన్ని ఓటిటి అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
