
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దీపావళి కానుక అదిరిపోయింది. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాకా’ నుంచి మేకర్స్ ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి చేతిలో కొడవలి పట్టుకొని పొలంలో కనిపిస్తున్నారు. ఆయన లుక్, యాక్షన్ మోడ్ చూస్తుంటే సినిమాలో మెగాస్టార్ ఊచకోత ఏ రేంజ్లో ఉండబోతుందో పోస్టర్‌తోనే హింట్ ఇచ్చినట్లుంది.
ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి-బాబీ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకోవడంతో.. మరోసారి ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ‘కాకా’పై ఆసక్తి పెరిగింది. అందులోనూ ఈసారి చిరంజీవిని మరింత మాస్ అవతార్‌లో చూపించబోతున్నారనే టాక్ ఉంది.
ఇక ఈ పోస్టర్‌తో పాటు సినిమా విడుదల తేదీపై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. దీంతో ‘కాకా’ వాయిదా పడుతుందంటూ ఇటీవల వినిపించిన ప్రచారానికి చెక్ పడింది.
ఈ కీలక పాత్రలో అనస్వర రాజన్ నటిస్తుండగా, థమన్ సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి సంక్రాంతి బరిలోకి దిగనున్న మెగాస్టార్.. ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.
[Kaaka Diwali Poster, Chiranjeevi Kaaka Movie, Kaaka Sankranthi Release, Kaaka Release Date, Kaaka Movie, Megastar Chiranjeevi, Bobby Kolli, Anaswara Rajan, Telugu Film News]
