Home Latest News మగపిల్లల పెంపకంలో చేయకూడని ఐదు పొరపాట్లు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి! | అబ్బాయిల పెంపకం తల్లిదండ్రులకు చిట్కాలు | మంచి భవిష్యత్తు కోసం పిల్లల పెంపకంలో చేయవలసినవి మరియు చేయకూడనివి | కాన్ఫిడెంట్ అబ్బాయిలను పెంచడానికి ఎఫెక్టివ్ పేరెంటింగ్ చిట్కాలు | అబ్బాయి పిల్లల పెంపకం మార్గదర్శకం – Andhra Waves

మగపిల్లల పెంపకంలో చేయకూడని ఐదు పొరపాట్లు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి! | అబ్బాయిల పెంపకం తల్లిదండ్రులకు చిట్కాలు | మంచి భవిష్యత్తు కోసం పిల్లల పెంపకంలో చేయవలసినవి మరియు చేయకూడనివి | కాన్ఫిడెంట్ అబ్బాయిలను పెంచడానికి ఎఫెక్టివ్ పేరెంటింగ్ చిట్కాలు | అబ్బాయి పిల్లల పెంపకం మార్గదర్శకం – Andhra Waves

by andhra andhrawave
0 comments
మగపిల్లల పెంపకంలో చేయకూడని ఐదు పొరపాట్లు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి! | అబ్బాయిల పెంపకం తల్లిదండ్రులకు చిట్కాలు | మంచి భవిష్యత్తు కోసం పిల్లల పెంపకంలో చేయవలసినవి మరియు చేయకూడనివి | కాన్ఫిడెంట్ అబ్బాయిలను పెంచడానికి ఎఫెక్టివ్ పేరెంటింగ్ చిట్కాలు | అబ్బాయి పిల్లల పెంపకం మార్గదర్శకం


పిల్లల పెంపకం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రయాణం. ముఖ్యంగా మగపిల్లలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సమాజంలో మగపిల్లల పెంపకానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ పెంపకంలో కూడా మార్పులు రావడం చాలా అవసరం.మగపిల్లలను కేవలం క్రమశిక్షణ పేరుతో కట్టడి చేయడం వల్ల వారి మానసిక వికాసం దెబ్బతినే అవకాశం ఉంది. పిల్లలు పూర్తీగా ఎదగాలంటే వారిని అర్థం చేసుకుంటూ సరైన మార్గంలో నడిపించాలి. మగపిల్లల పెంపకంలో తల్లిదండ్రులు సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు ఏమిటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? వివరంగా తెలుసుకుంటే..

అల్లరిని ఆపకూడదు..

మగపిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు మొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం వారిని అల్లరి ఎప్పుడూ ఆపకూడదు. పిల్లలు అల్లరి చేయడం వారి మెదడు ఎదుగుదలలో ఒక భాగం. వారు ఆటలాడుకుంటూ, ఇళ్లంతా తిరుగుతూ చేసే అల్లరి వారి శారీరక , మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది. ప్రతి చిన్న విషయానికి వారిని అరిచి, భయపెట్టడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే సహజమైన అల్లరిని కొంతవరకు పిల్లలకు అర్థం చేసుకోవడం, దాన్ని సరైన పద్ధతిలో మళ్లించాలి.


రోజంతా ఇంట్లోనే ఖాళీగా కూర్చోబెట్టడం..

పిల్లలను రోజూ ఆరుబయట ఆటలాడడానికి పంపాలి. వారి బ్రెయిన్ డెవలప్‌మెంట్ కి ఆటలు చాలా అవసరం. ప్లే గ్రౌండ్ లో ఆడుకోవడం వల్ల పిల్లలలో సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. తోటి పిల్లలతో కలిసిమెలిసి తిరగడం, టీమ్ స్పిరిట్ నేర్చుకోవడం నేర్చుకోవడం ఆటల ద్వారానే సాధ్యమవుతుంది. ఇంట్లోనే మొబైల్స్ లేదా వీడియో గేమ్స్‌కి పరిమితం చేయకుండా శారీరక శ్రమ ఉండే ఆటలను ప్రోత్సహించాలి.

ఏడ వద్దని చెప్పడం..

మగపిల్లలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. వారు బాధగా ఉన్నప్పుడు, కష్టంగా అనిపించినప్పుడు ఏడవడం సహజం. అలాంటప్పుడు వారి భావాలను అణచివేయడం వల్ల భవిష్యత్తులో వారు తమ భావాలను లేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. మగపిల్లలు ఏడవకూడదు.. లాంటి మాటలు అస్సలు చెప్పకూడదు. వారి బాధను బయటకు వ్యక్తం చేయడానికి స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే వారు మానసికంగా దృఢంగా ఎదుగుతారు.


ప్రయత్నాలకు ప్రోత్సాహం..

భయం వల్ల ప్రతి చిన్న విషయానికి పిల్లలను కట్టడి చేస్తారు. అయితే సురక్షితమైన హద్దుల్లో ఉంచుతూనే పిల్లలు చేయాలనే పనులకు, కొత్త ప్రయత్నాలకు వారిని ప్రోత్సహించాలి. ఇలాంటి చిన్న సాహసాలు చేయడం వల్ల పిల్లల్లో ధైర్యం పెరుగుతుంది , భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తి వస్తుంది.


తండ్రి ప్రవర్తన..

పిల్లలు ముఖ్యంగా మగపిల్లలు తమ తండ్రిని ఆదర్శంగా తీసుకుంటారు. తండ్రి ఇంత బయట ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇతరులను ఎలా గౌరవిస్తున్నాడు అనే అంశాలను పిల్లలు నిశితంగా గమనిస్తున్నారు. పిల్లలు తండ్రిని చూసి ప్రవర్తన నేర్చుకుంటారు కాబట్టి ఇంట్లో పెద్దల ప్రవర్తన ఎప్పుడూ ఆదర్శప్రాయంగా ఉండాలి.

మొత్తంగా చెప్పాలంటే మగపిల్లల పెంపకం కేవలం నియంత్రణతో కూడుకున్నది కాకుండా, ప్రేమతో, అవగాహనతో సాగాలి. వారి ఆలోచనలను గౌరవిస్తూ, సరైన మార్గదర్శకత్వం అందించినప్పుడే వారు మంచి పౌరులుగా ఎదుగుతారు. తల్లిదండ్రులు ఈ చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ తీసుకుంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం చాలా సులభం.

*రూపశ్రీ.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird