ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మరో ఆసక్తికరమైన మూవీ వచ్చింది. అదే కన్నడ సినిమా ‘అనిరీక్షిత అతిథిగలు’ . ఈ సినిమా ఒటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా IMDbలో ఈ సినిమాకు ఏకంగా 9.5 రేటింగ్ ఉండటం విశేషం. సస్పెన్స్, క్రైమ్, సర్వైవల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో పూర్తి వివరాలు చూడండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. కొత్తగా పెళ్లయిన విభు, తాశ్వి అనే జంట సరదాగా గడిపేందుకు ఓ అందమైన ప్రాంతంలోని గెస్ట్‌హౌస్‌కు వెళ్తారు. ప్రశాంతంగా గడపాలనుకున్న వారికి అక్కడ అనుకోని ఎదురువుతారు. ఐదుగురు యువకులు ఆ గెస్ట్‌హౌస్‌లోకి రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి.
వారిలో కొందరు ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు, హత్య చేయడానికి ప్లాన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొత్త జంట భయాందోళనలకు గురవుతుంది. ఆ ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. అసలు ఆ గెస్ట్‌హౌస్‌లో ఏం జరుగుతుంది? ఆ ఐదుగురు యువకుల వెనుక ఉన్న రహస్యాలేంటి? కొత్త జంట ప్రాణాలతో బయటపడిందా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్, సర్వైవల్ వస్తువులను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయస్. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి.
మరిన్ని ఓటిటి అప్డేట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
