Home తెలంగాణ Vijay KTR YS Jagan: విజయ్ ని కలిస్తే.. కేటీఆర్, జగన్ – Andhra Waves

Vijay KTR YS Jagan: విజయ్ ని కలిస్తే.. కేటీఆర్, జగన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Vijay KTR YS Jagan: మీరు అతడు సినిమా చూశారా.. అందులో మీరు అవునన్న వాడు మంత్రి.. కాదన్నవాడు కంత్రి అని షాయాజి షిండే ఓ డైలాగ్ అంటాడు గుర్తుందా.. అది సినిమా డైలాగ్ కాదు.. లైఫ్ రియల్ కూడా.. ఎందుకంటే జనాలు తలుచుకుంటే నాయకులు పుడతారు. జనాలు వద్దనుకుంటే నాయకులు షెడ్ కి వెళ్ళిపోతారు.. ఇది జగమెరిగిన సత్యం. మనదేశమే కాదు.. యావత్ ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని అమలుచేసే దేశాల్లో జరుగుతున్నది ఇదే. ఒకప్పటి రోజులు […]

విజయ్ కేటీఆర్ వైఎస్ జగన్: మీరు అతడు సినిమా చూశారా.. అందులో మీరు అవునన్న వాడు మంత్రి.. కాదన్నవాడు కంత్రి అని షాయాజి షిండే ఓ డైలాగ్ అంటాడు గుర్తుందా.. అది సినిమా డైలాగ్ మాత్రమే కాదు.. రియల్ లైఫ్ కూడా.. ఎందుకంటే జనాలు తలుచుకుంటే నాయకులు పుడతారు. జనాలు వద్దనుకుంటే నాయకులు షెడ్ కి వెళ్ళిపోతారు.. ఇది జగమెరిగిన సత్యం. మనదేశమే కాదు.. యావత్ ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని అమలుచేసే దేశాల్లో జరుగుతున్నది ఇదే.

ఒకప్పటి రోజులు ఏమోగానీ.. ఇప్పటి నాయకుల్లో జనాల ఆమోదంతో సంబంధం లేకుండానే స్వయం ప్రకటిత ప్రజాప్రతినిధులుగా ముద్ర వేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కిరాయి వ్యక్తులతో పిచ్చిపిచ్చిగా ప్రచారం చేసుకుంటూ.. ఊహా లోకంలో తేలిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా అనేది ఒక బలమైన మాధ్యమం మాత్రమే. ఒకరకంగా చెప్పాలంటే అది ఎవరికి వారు రాసుకునే సొంత బయోగ్రఫీ. అంతేతప్ప అది వారినిర్ణయాన్ని.. వ్యక్తుల ఆలోచనలు నిర్ణయించలేదు. ఒక వ్యక్తి అదే పనిగా సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకుంటున్నాడు అంటే తెర వెనుక ఏదో జరుగుతోంది అని అర్థం చేసుకోవాలి. ఒకప్పటి రోజుల్లో ఇది జనానికి అంతగా అర్థం అయ్యేది కాదు. ఇప్పటి కాలంలో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. పాలకు పాలు.. నీళ్లకు నీళ్లు జనాలకు తెలుస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు జనాల కళ్ళకు గంతలు గట్టి.. మసి పూసి మారేడు కాయ చేయాల్సిన అవసరం లేదు. కానీ నేటి కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు ఇలానే చేస్తున్నారు.

సోషల్ మీడియాని మాత్రమే నమ్ముకుంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు. జై కొట్టి ఓట్లు వేసే అవకాశం లేదు. ఉదాహరణకు తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకుంటే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ విజయ్ సోషల్ మీడియా కంటే జనాలను బాగా నమ్ముకున్నారు. పైగా ద్రావిడ రాజకీయాలతో విసిగిపోయిన అక్కడి ప్రజలు ఆయన నాయకత్వాన్ని బలపరిచారు. అలాగని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని ఇవ్వలేదు. ఆయన ప్రభుత్వం కూడా అటుకుల బొంతనే. కాకపోతే విజయ్ కి తమిళనాడు రాష్ట్రంలో చరిష్మా ఉంది కాబట్టి సాగిపోతోంది.. ఈ సందర్భంగా విజయ్ కూడా అంగీకరిస్తారు. అందువల్లే ఆయన ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇటీవల కాలంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయ్‌కి అనుకూలమైన ఫలితం వచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో మెజార్టీ మాత్రం రాలేదు. దీనిని బట్టి ప్రజల్లో నమ్మకం ఏర్పరచుకోవడం.. ఆ నమ్మకాన్ని స్థిరంగా కొనసాగించడం అంత ఈజీ కాదు.

ఇక విజయ్ పరిపాలన గురించి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఆయన అభిమాన సంఘాలు.. అభిమానులు గొప్పగా ప్రచారం చేస్తున్నారు. వీడియోలతో మాయ చేస్తున్నారు. కాకపోతే ఇది ఎల్లకాలం కొనసాగదు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ డిఎంకె.. అన్నా డీఎంకే చేశాయి. ఇప్పుడు విజయ్ తమిళనాడు రాజకీయాలకి కొత్త ఆప్షన్ లాగా కనిపిస్తున్నాడు కాబట్టి జనాలకి కాస్త ఆసక్తి ఉంటుంది. పరిపాలనలో కొత్తదనం లేకపోతే.. విజయ్ పరిపాలన కంటే ఎలివేషన్ ల మీద మాత్రమే దృష్టి సారిస్తే.. కూసాలు మొత్తం కదిలిపోతాయి.

ఇక విజయ్.. గురువారం వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ జార్జి రెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి కుమార్తె వివాహానికి ప్రముఖ నటుడు. విజయ్ ప్రభుత్వంలో అనిల్ రెడ్డి తెరవెనుక పాత్ర పోషిస్తున్నారు. బలమైన ఆర్థిక నేపథ్యం.. తమిళనాడు రాజకీయాలలో గట్టిగా ఈయనకు పరిచయాలు ఉన్నాయి. కాబట్టి విజయ్ కి అనిల్ అవసరం. అనిల్ కు కూడా భారీగానే వ్యాపారాలు ఉన్నాయి. కాబట్టి విజయ్ సపోర్ట్ అతనికి అవసరం. ఇక్కడ బంధాలు లేవు. స్నేహాలు లేవు. బంధుత్వాలు అంతకంటే లేవు. కేవలం వ్యాపారం మాత్రమే. పైగా తన పార్టీలో తెరవెను కాబట్టి విజయ్ ఆ పెళ్లికి వెళ్ళాడు. జగన్ కు అనిల్ సోదరుడు కాబట్టి సతి సమేతంగా అక్కడికి వెళ్ళాడు. కేటీఆర్ కు ఆహ్వానం అందినట్టుంది.. ఆయన కూడా హాజరయ్యాడు. మొత్తానికి ముగ్గురు కలిసి దిగిన గులాబీ పార్టీ.. వైసిపి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. వీరు ముగ్గురు కలిస్తే దక్షిణాదిలో మంటలు పుట్టడం ఖాయమని సొంత కీర్తనలు ఆలపిస్తున్నాయి.

కేటీఆర్ మీద సొంత సోదరి ఆరోపణలు చేస్తున్నారు. విజయ్ మీద సొంత భార్య కోర్టు వరకు వెళ్ళింది. కుమార్తె.. కొడుకు తండ్రి పేరు చెప్పడానికి కూడా ఆసక్తిని చూపించడం లేదు. తండ్రి ముఖ్యమంత్రి అయినా కనీసం ఇవాల్టి వరకు కూడా విజయ్ ని అభినందించలేదు. అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే అకిరా.. ఆద్య అభినందించారు. తండ్రితో పాటు ఉన్నారు. ఇక జగన్ మీద షర్మిల చేస్తున్న విమర్శలు.. జరుగుతున్న పంచాయతీలు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంత కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేని వ్యక్తులు ప్రజలకు న్యాయం చేస్తారంటే ఎవరు నమ్ముతారని టిడిపి నేతలు అంటున్నారు. సోషల్ మీడియాలో ఎలివేషన్ల కోసం ఈ బాగానే ఉంటారని.. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంటేనే ముఖ్యమంత్రులు అవుతారని.. ఆ విషయం తెలియకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే ఉపయోగం ఉండదని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో బెంగళూరులో ఒక ప్రైవేట్ కేటీఆర్… జగన్ కలిసి. అప్పుడు గులాబీ కూడా ఇదే స్థాయిలో వైసిపి.. పార్టీ ఎలివేషన్లు ఇచ్చాయి. అన్నట్టు అనిల్ రెడ్డి కుమార్తె వివాహానికి విజయ్ హాజరైనప్పటికీ.. టి వి కే సోషల్ మీడియా ఈ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడం లేదు. దీనిని బట్టి తెరవెనుక ఏం జరుగుతోంది… తెర వెనుక ఏముంది అనే విషయం.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని టిడిపి నేతలు చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird