Home ఆంధ్రప్రదేశ్ YS Jagan Mohan Reddy: జగన్ ఎంట్రీ ఇచ్చాడు.. – Andhra Waves

YS Jagan Mohan Reddy: జగన్ ఎంట్రీ ఇచ్చాడు.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


YS Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి తమిళ గడ్డ మీద అడుగు పెట్టాడు. విజయ్ తో చేతులు కలిపాడు. సరదాగా భుజం తట్టి అభినందించాడు. ఫోటోలకు నవ్వుతూ ఫోజులు ఇచ్చాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.. తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం నేల చూపులు చూడటం మొదలైంది. తమిళనాడులో విజయ్ సమర్థంగా పరిపాలన సాగిస్తున్నారు. వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ప్రస్తుతం ఆయన ప్రభుత్వానికి చిక్కులు వచ్చి పడ్డాయి. […]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: జగన్మోహన్ రెడ్డి తమిళ గడ్డ మీద అడుగు పెట్టాడు. విజయ్ తో చేతులు కలిపాడు. సరదాగా భుజం తట్టి అభినందించాడు. ఫోటోలకు నవ్వుతూ ఫోజులు ఇచ్చాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.. తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం నేల చూపులు చూడటం మొదలైంది.

తమిళనాడులో విజయ్ సమర్థంగా పరిపాలన సాగిస్తున్నారు. వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ప్రస్తుతం ఆయన ప్రభుత్వానికి చిక్కులు వచ్చి పడ్డాయి. విజయ్ కోయంబత్తూరులో ఇటీవల పెరియార్ అరి ఉలగం లైబ్రరీని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ఏర్పాటుచేసిన పుస్తకాలకు సంబంధించి కొనుగోలు అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. అందువల్లే తమిళనాడులో రచ్చ జరుగుతుంది. అయితే ఈ వ్యవహారం వెనుక రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. అందులో ప్రధానమైనది ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో.. సీఎం విజయ్ ఇటీవల సమావేశం..

ఇటీవల వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహానికి జగన్.. తమిళనాడు సీఎం విజయ్ ని ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఇద్దరు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపద్యంలో విజయ్ డ్రీం ప్రాజెక్టు పెరియర్ అరి ఉలగం చిక్కుల్లో పడింది. దీంతో జగన్ పలకరించిన సమయం.. సందర్భం ఏమోగానీ విజయ్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

తమిళనాడులో ఏడు ఎకరాల విస్తీర్ణంలో.. 300 కోట్ల బడ్జెట్‌తో గ్రంథాలయాన్ని నిర్మించారు. 1800 పుస్తకాలు ఏ ఐ ద్వారా రాసినవని.. రచయితలు లేని పేర్లతో పుస్తకాలను సృష్టించారని ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్ ప్రచురణ. 250 విలువైన పుస్తకాలపై ఏకంగా 1500 ధర ఉన్నట్టుగా ముద్రించారని.. అడ్డగోలుగా దోచుకున్నారని.. ఇక బిజెపి మాజీ నాయకుడు అన్నామలై ఈ వ్యవహారంపై ఇండిపెండెంట్ దర్యాప్తుకు డిమాండ్ చేశారు. కంపెనీ డిఎంకె.. టీవీకే మధ్య ఆరోపణలు నడుస్తున్నాయి. పరిస్థితులు పూర్తిగా చేయిపోయిన నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

సోషల్ మీడియాలో ఈ వ్యవహారాన్ని రాజకీయాలకు అనుసంధానిస్తూ కొంతమంది ఏపీ సెటైర్లు వేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో రివర్స్ టెండర్ల వ్యవహారం జరిగింది. విజయ్ తో జగన్ మాట్లాడగానే తమిళనాడులో ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ఎక్కడ అడుగుపెట్టినా సరే.. ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చిన సరే.. మొత్తం సీన్ రివర్స్ అవుతుందంటూ చాలామంది సోషల్ మీడియాలో మీమ్స్ సృష్టిస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird